సముద్రపు ఒడ్డున బిగ్ బాస్ దివి.. వైరల్ గా మారిన ఫోటోలు!

దివి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మోడల్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం పలు షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న దివి బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా అందరికీ సుపరిచితం అయ్యారు.ఇలా బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె బిగ్ బాస్ అనంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటమే కాకుండా కెరియర్ పరంగా సినిమా అవకాశాలు అందుకుని ప్రస్తుతం బిజీగా ఉన్నారు. బిగ్ బాస్ తరువాత మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.

తాజాగా సందీప్ కిషన్ నటించిన A1 ఎక్స్ ప్రెస్ సినిమాలో కూడా దివి కీలక పాత్రలో నటించారు. అలాగే పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ విధంగా ఎంతో బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియా వేదికగా అందాల జాతర చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు.ఇప్పటికే ఈమెకు సంబంధించిన ఎన్నో గ్లామర్ ఫోటోలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన దివి తాజాగా సముద్రపు ఒడ్డున అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

ఈ క్రమంలోనే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. గులాబి రంగు స్లీవ్లెస్ ధరించి ఎంతో వయ్యారంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇక ఈమె గ్లామరస్ ఫోటోలకు నెటిజన్లు ఫిదా అవుతూ ఈ ఫోటోలపై తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు నెటిజన్లు రోజురోజుకు మీ అందం పెరిగిపోతోంది అంటూ కామెంట్లు చేయగా మరికొందరు ఈమె ఏకంగా అజంతా శిల్పంతో పోలుస్తూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దివి ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.