బిగ్‌బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్ అందర్నీ కదిలించింది. ఈ నాలుగు సీజన్లలోనూ నిన్నటి ఎపిసోడ్ ది బెస్ట్‌గా మిగిలిపోయింది. కంటెస్టెంట్లు ఫ్యామిలీ మెంబర్స్ రావడం, చాలా రోజుల తరువాత అమ్మను చూడటంతో అందరూ ఎమోషనల్ అయ్యారు. అయితే గత సీజన్ల మాదిరి ఎవ్వరూ భోరున ఏడుస్తూ అతి చేయలేదు. నిన్న అఖిల్, అభిజిత్, అవినాష్, హారిక వాళ్ల అమ్మలు ఎంట్రీ ఇచ్చారు. ఒక్క అఖిల్ కాస్త వెక్కి వెక్కి ఏడ్చాడు. అంతేకానీ గత సీజన్ మాదిరి కన్నీటీధారలు, భోరున ఏడ్వడం వంటివి చేయలేదు.
అయితే ఇందులో ప్రతీ ఒక్క కంటెస్టెంట్ మదర్ స్పెషల్ అనే చెప్పాలి. ఎవరి ప్రత్యేక వారిదే. కానీ చివరకు అందరూ అమ్మదనాన్ని చూపించి వెళ్లిపోయారు. ప్రతీ ఒక్క కంటెస్టెంట్‌ను ప్రేమగా పలకరించడం, ప్రేమగా చూసుకోవడం, అలాగే ఉండాలని చెప్పడం వంటివే చేశారు. కానీ గత సీజన్లో శ్రీముఖి మదర్‌లా వార్నింగ్, వెరైటీ సలహాలు ఇవ్వలేదు. పైగా ఈసారి అందరూ కలిసి చక్కగా మాట్లాడుకున్నారు. అయితే కోవిడ్ నిబంధనల కారణంగా భౌతికంగా కలుసుకునే అవకాశాన్ని ఇవ్వలేదు.
గార్డెన్ ఏరియాలో గ్లాసు రూంలో అమ్మలందరినీ ప్రవేశ పెట్టాడు. అందులో హారిక తన అమ్మ జ్యోతితో చెప్పిన మాటలు, హారికకు వాళ్ల అమ్మ జ్యోతి చెప్పిన క్యూట్ క్యూట్ మాటలు తల్లికూతుళ్ల మధ్య ఉన్న అన్యోన్యతను తెలిపింది. ఎంతో క్యూట్‌గా ఫ్రెండ్స్‌లా మాట్లాడుకుంటూ సెటైర్లు వేసుకున్నారు. చివర్లో బిగ్ బాస్ వెళ్లమని ఆదేశించగానే జ్యోతి వెళ్లిపోతోండగా.. హారిక ఓ కామెంట్ చేసింది. ఏంటే అమ్మ అంత పద్దతిగా ప్రవర్తిస్తున్నావ్.. కాసేపు ఉండు అంటూ అమ్మ మీద ప్రేమను చాటింది. అలా వెళ్లి పోతూ ఉంటూ ఐలవ్యూ అమ్మ ఐలవ్యూ అమ్మ అని అరిచింది.