Bigg Boss Telugu 4: అబ్బా.. ఇంటికి వెళ్లాల్సిన టైం వచ్చింది!!

Bigg Boss 4 Telugu

అయిపోయింది.. అంతా అయిపోయింది.. అనుకున్నదే నిజమైంది. కరాటే కళ్యాణికి బిగ్‌బాస్ వీడ్కోలు చెప్పే తరుణం వచ్చేసింది. అందుకే ఏదైనా సరే అతిగా ప్రవర్తించకూడదని అంటారు. కరాటే కళ్యాణి తన అతిని చూపెట్టడంతో రెండో వారంలో నిష్క్రమించాల్సి వచ్చింది. రెండో వారంలో కరాటే కళ్యాణి తట్టాబుట్టా సర్దుకుని వెళ్లాల్సి వచ్చింది.

Bigg Boss 4 Telugu Week 2 Karate Kalyani Got Eliminated
Bigg Boss 4 Telugu Week 2 Karate Kalyani Got Eliminated

అవును ఇది నిజం కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయింది. రెండో వారంలో తొమ్మిది మంది గంగవ్వ, నోయల్, మోనాల్, అభిజీత్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, సోహెల్, హారిక నామినేట్ అయ్యారు. అందులో మరీ తక్కువగా ఓట్లు రావడంతో కరాటే కళ్యాణి ఇంటి బాట పట్టేసింది.

బిగ్‌బాస్ హౌస్‌లో ఆమె చేసిన తప్పులే ఆమెకు శాపంగా మారాయి. ప్రతీ కంటెస్టెంట్‌తో గొడవలు పెట్టుకోవం, మాటిమాటికి ఏడుపు లేదా అరుపు. ఇలా చేసి చేసి ప్రేక్షకులకు విసుగు తెప్పించింది. అయితే రెండో వారంలో కాస్త జాగ్రత్తగానే ఉన్నా కూడా ఫలితం దక్కలేదు.చేతులు కాలాకా ఆకులు పట్టుకున్నట్టైంది కరాటే కళ్యాణి వ్యవహారం.

Bigg Boss 4 Telugu Week 2 Karate Kalyani Got Eliminated
Bigg Boss 4 Telugu Week 2 Karate Kalyani Got Eliminated

మొత్తానికి రెండో వారంలో తొమ్మిది మందిలో కరాటే కళ్యాణి ఎలిమినేట్ అయిపోయింది. ఇక వెళ్లే ముందు ఎలాంటి బాంబులు వేసి పోతుంది. ఏ కంటెస్టెంట్‌ను ఎలా వర్ణిస్తుందో చూడాలి. ఏది ఏమైనా కరాటే కళ్యాణి వెళ్లిపోతే హౌస్ ప్రశాంతంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.