Bigg Boss Telugu 4: బిగ్‌బాస్.. ఎలిమినేట్ 2 అయ్యేది ఎవరంటే?

Bigg Boss 4 Telugu Buzz Is That Mehaboob Got Eliminated

బిగ్‌బాస్ షోలో రెండో వారం మొత్తానికి గడిచిపోయేందుకు వచ్చింది. ఇక వారాంతం వచ్చేసింది. నాగార్జున్ వచ్చి అందరికీ క్లాసులు పీకుతాడు. ఆటలు ఆడించి పాటలు పాడించి ప్రేక్షకులను ఎంటరైన్ చేయిస్తాడు. అదంతా పక్కన పెడితే ఈ వారం నామినేషన్‌లో దాదాపు సగానికి పైగా ఉన్నారు. పడవ ప్రయాణం అంటూ తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఇందులో గంగవ్వ, నోయల్, మోనాల్, అభిజీత్, అమ్మ రాజశేఖర్, కరాటే కళ్యాణి, కుమార్ సాయి, సోహెల్, హారిక నామినేట్ అయ్యారు.

Bigg Boss 4 Telugu Week 2 Elimination Become Hot topic
Bigg Boss 4 Telugu Week 2 Elimination Become Hot topic

ఈ తొమ్మిది మంది ఎలిమినేషన్‌లో ఉన్నా కూడా అందులో స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఎవరన్న సంగతి అందరికీ తెలిసిందే. గంగవ్వ, నోయల్, అభిజీత్, హారిక, మోనాల్‌లకు బయట బాగా క్రేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఓట్ల ద్వారా అయితే గంగవ్వ బయటకు వెళ్లే ప్రసక్తే లేదు. ఇక నోయల్ ఫాలోయింగ్, సపోర్ట్ కూడా తక్కువేమీ లేదు. పైగా కెప్టెన్‌గా కూడా ఎన్నికయ్యాడు.

ఇక అభిజీత్, హారిక, మోనాల్ లవ్ ట్రాక్‌ల వల్ల ఇప్పుడప్పుడే ఎలిమినేట్ కారు. ఇక మిగిలిన ముగ్గురిలో కరాటే కళ్యాణియే వెళ్లేందుకు ఎక్కువ అవకాశం ఉంది. అయితే గత వారం కంటే ఈ వారం కళ్యాణి కాస్త పద్దతిగానే ఉంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి.. తన స్టామినాను నిరూపించుకోలేకపోయాడు. అమ్మ రాజశేఖర్ కుళ్లు జోకులు, అనవసరంగా చర్చలు జరపడం వంటివి చేస్తూ ఉండటంతో బయట కాస్త నెగెటివిటీ పెరిగింది. ఈ ముగ్గురిలోనే ఒకరు ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. చూడాలి మరి రెండో వారంలో ఎవరు ఇంటికి వెళ్లనున్నారో.