బిగ్ బాస్ షో ముగిసేందుకు వచ్చింది. చివరి వారంలోకి షో ఎంటరైంది. టాప్ 5 కంటెస్టెంట్లు జాలీగా ఇంట్లో ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇప్పుడు అందరూ కూడా ఇంట్లో తెగ సంతోషంగా బతికేస్తున్నారు. ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దని సంతోషంగా ఉందామని అనుకున్నారో ఏమో గానీ నిన్న బిగ్ బాస్ మళ్లీ ఓ టాస్క్ ఇచ్చాడు. ఎవరి గురించి వారు చెప్పుకోవాలి.. వారి వారి మాస్కులను తీసుకోవడమే కాకుండా తలా ఓ కంటెస్టెంట్.. మరో ఇంటి సభ్యుడి పేరు చెప్పి వారి మాస్క్ తీయాల్సి ఉంటుందని చెప్పాడు.
అయితే ఈ టాస్క్‌లో గొడవలు జరుగుతాయని బిగ్ బాస్ అనుకున్నాడు. కానీ చివరకు దాన్ని కూడా కామెడీ చేసేశారు. కొట్లాటలు లేకుండా చాలా సింపుల్‌గా కానిచ్చేశారు. అయితే అందులో భాగంగా అభిజిత్ మొదటగా తన మాస్క్ తీసేసుకున్నాడు. తనలో కోపం ఉందని ఇక్కడికి వచ్చాకే తెలిసిందన్నాడు. అది కూడా సోహెల్ అరియానాలు సీక్రెట్ రూం నుంచి ఇంట్లోకి వచ్చాక ఆ రోజు ఫైర్ అయ్యానని, తనకు కూడా కోపం వస్తుందని అప్పుడే తెలిసిందని అభిజిత్ అన్నాడు.
ఇక హారిక తన మాస్క్ తీసేస్తే.. తనలోని ఓ క్వాలిటీ గురించి చెప్పింది. తనకు పొసెసివ్ అనేది ఉందని అభిజిత్ వల్లే తెలిసిందని చెప్పుకొచ్చింది. తనవాడు అంటే తనతోనే ఉండాలని అభిజిత్ వల్లే తెలిసింది. అభిజిత్.. మోనాల్, స్వాతి, అరియానాలతో మాట్లాడుతూ ఉంటే ఏదో అనిపించేదని తెలిపింది. మొత్తానికి హారిక తన మనసులోని మాటను బయటకు చెప్పేసింది. అభిజిత్ మీదున్న ఫీలింగ్‌ను బయట పెట్టేసింది. బెస్ట్ ఫ్రెండ్ అంటూనే పొసెసివ్, జెలసీ ఫీలవుతోన్నానని చెప్పేస్తోంది.