బిగ్ బాస్4: అఖిల్ ఇన్‌స్టాగ్రాం చెక్ చేసిందా.. అంటే మోనాల్‌కు అన్నీ ముందే తెలుసా?

Bigg Boss 4 Telugu week 14 Monal Entered with plan on Akhil

బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా వచ్చేవారికి కూడా ఎవరెవరు వస్తున్నారన్న విషయం దాదాపు తెలియదు. ఇంట్లోకి వెళ్లిన తరువాతే తెలుస్తుంది. అలాంటి మోనాల్ మాత్రం నిన్నటి ఎపిసోడ్‌లో ఓ విషయాన్ని బయపెట్టింది. నాగార్జున ఇచ్చిన ఓ టాస్క్ మోనాల్ మనసులో విషయాన్ని బయటకు తీసుకొచ్చింది. ఇంట్లో రాగానే కలిగిన మొదటి ఇంప్రెషన్, ఇప్పుడున్న ఇంప్రెషన్ చెప్పాలని తెలిపాడు. అలా నచ్చిన ముగ్గురిని, నచ్చని ఇద్దరిని చెప్పాల్సి ఉంటుందన్నాడు.

Bigg Boss 4 Telugu week 14 Monal Entered with plan on Akhil

అలా మోనాల్ తన దృష్టిలో హారిక అఖిల్ సోహెల్ నచ్చారని.. అభిజిత్, అరియానా నచ్చలేదని తెలిపింది. మొదట్లో హారిక అంత కలవలేకపోయినా ఇప్పుడు మాత్రం చెల్లిలాగా అయిపోయిందని చెప్పింది. సోహెల్ కూడా మొదట వచ్చిన రోజు అంతగా కలవలేదు.. చాలా కోపంతో కనిపించాడు.. కానీ ఇప్పుడు మాత్రం బ్రదర్‌లాగా అంటూ ఆ ఇద్దరి గురించి బాగానే చెప్పింది. ఇక అఖిల్ గురించి కాస్త ఎక్కువే చెప్పింది.

అయితే అఖిల్ విషయంలో మొదటగా జరిగిన సంఘటన గురించి చెప్పింది. అఖిల్ ఇంట్లోకి వచ్చాక నీళ్లు ఇస్తే.. కాసేపు ఆగు.. ఇళ్లు చూస్తాను అంటూ నన్ను పట్టించుకోలేదు అంటూ మోనాల్ చెప్పుకొచ్చింది. ఇంట్లోకి రాకముందే అఖిల్ ఇన్ స్టాగ్రాం చెక్ చేశానని, మోస్ట్ డిజైరబుల్ మెన్ అని ఉందని చెప్పుకొచ్చింది. అంటే అఖిల్‌కు సంబంధించిన వివరాలు, ఇంట్లోకి వస్తాడని బిగ్ బాస్ టీం ముందే మోనాల్‌కు అన్ని సూచనలు ఇచ్చాయా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.