బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో అభిజిత్ మోనాల్ అఖిల్ ట్రాక్ ఎప్పటికీ హైలెటే. ఒకప్పుడు ప్రేమ దేశం సినిమాలా ఉన్న ట్రయాంగిల్.. మధ్యలో ఎన్నో మార్పులకు లోనైంది. మోనాల్‌కు కొన్ని సార్లు అఖిల్‌తో గొడవలు.. ఇంకొన్ని సార్లు అభిజిత్‌తో గొడవలు అవుతూనే ఉంటాయి. ఎవరితో ఎన్ని గొడవలు అయినా కూడా చివరకు అఖిల్ పంచన చేరుతుంది. ఎందుకంటే అభిజిత్ మోనాల్‌ను ఎప్పటి నుంచో దూరం పెట్టడం ప్రారంభించాడు.
మోనాల్‌ను అభిజిత్ దూరం పెట్టినట్టే కనిపిస్తూ ఉంటుంది.. మధ్యలో మళ్లీ ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. అభిజిత్ ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తాడో అతడికే తెలియదు. అయితే అదంతా కాసేపు పక్కన పెడదాం. ఒకప్పుడు నాగార్జున మోనాల్‌ను A అనే అక్షరం అంటూ ఏడిపించే వాడు. మోనాల్ అభిజిత్ అఖిల్ అంటూ తిరిగేది. ఇద్దరినీ తన వెంటే తిప్పుకునేది. నాగార్జున కూడా ఆ ట్రయాంగిల్ ట్రాకును బాగానే ఎంకరేజ్ చేసేవాడు.
అందుకు A అంటూ మోనాల్‌ను ఏడిపించేవాడు కానీ A అంటే అభిజితా? అఖిలా? అని అడగలేదు. అయితే ఇంత వరకు ఆ విషయం ఎప్పుడూ కూడా బయటకు రాలేదు. నిన్న మొదటి సారిగా అభిజిత్ ఆ గుట్టు బయటపెట్టేశాడు. A అంటే అభిజిత్ నా మనసులో ఉంది నువ్వే.. నువ్వంటే ఇష్టం అని మోనాల్ అభిజిత్‌తో ప్రేమ పాఠాలు చెప్పిందట. ఇంత వరకు ఈ విషయం ఎక్కడా చెప్పలేదంటూ..మోనాల్ ఏనాడూ ఏ స్టాండ్ తీసుకోలేదు.. అబద్దాలు చెబుతూ వచ్చిందని హారికతో అభిజిత్ తన బాధనంతా చెప్పుకున్నాడు.