బిగ్ బాస్ ఇంట్లో ప్రతీసారి రిలేషన్స్ పనికిరావు. టాస్క్‌లో ముందుకు కొనసాగాలంటే రిలేషన్స్, ఫ్రెండ్స్‌ను పక్కనపెట్టాల్సి వస్తుంది. అయితే ఈ కేటగిరీలో అఖిల్ మాత్రం ఫుల్ క్లారిటీతోనే ఉన్నాడు. నిన్నటి టాస్క్‌తో అది స్పష్టమైంది. నిన్న ఇచ్చిన కెప్టెన్సీ టాస్కులో ఎన్నో ట్విస్ట్‌లు పెట్టాడు. తొమ్మిది బాల్స్ మీద.. తొమ్మిది మంది కంటెస్టెంట్ల బొమ్మను అతికించారు. తన బొమ్మ ఉన్న బాల్‌ను తప్పా మిగతా ఏ బొమ్మ ఉన్న బాల్‌ని అయినా తీసుకోవచ్చు. అలా ఏ బొమ్మ ఉన్న బాల్ చివరగా బాస్కెట్‌లో పడుతుందో వారు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటారు.
ఈ ఆటలో మెహబూబ్ సోహెల్ అఖిల్ కలిసి ఆడారు. ఒకరి బాల్స్‌ను మరొకరు తీసుకుని ఆడారు. కానీ మోనాల్ బాల్‌ను అఖిల్ గానీ, అఖిల్ బాల్‌ను మోనాల్ గానీ తీసుకోలేదు. తనకు జోడి దొరకడం లేదని బాధపడింది. చివరకు లాస్యతో జోడీ కట్టింది. లాస్య బాల్‌ను పట్టుకుని మోనాల్ పరుగెత్తింది. కానీ బాస్కెట్‌లో వేయడంలో విఫలమైంది. మొదటి రౌండ్‌లోనే లాస్య ఓడిపోయినట్టైంది. ఇదే విషయాన్ని అఖిల్ మోనాల్‌తో చెబుతూ చాలా క్లారిటీ ఇచ్చాడు.
అఖిల్ మోనాల్‌తో మాట్లాడుతూ.. ఒకవేళ నువ్ నా బాల్.. నేను నీ బాల్‌ను తీసుకుంటే మొదటి రౌండ్‌లోనే నేను ఓడిపోయేవాడిని అందుకే నేను నీతో కలిసి ఆడలేదు అని చెప్పుకొచ్చాడు. మేం ముగ్గురం కలిసి ఆడాలని ఫిక్స్ అయ్యామని సోహెల్, మెహబూబ్ గురించి చెప్పాడు. అయినా ఇక్కడ ప్రతీ సారి నీతో ఆడాలని, నీకు సపోర్ట్ చేయాలన్న రూల్ ఏమీ లేదు అని మొహం మీదే చెప్పాడు. అంటే మోనాల్‌తో అఖిల్ టైం పాస్ మాత్రమే చేస్తున్నాడా? అని నెటిజన్లుకామెంట్లు చేస్తున్నారు.