Bigg Boss 4 Telugu: అమ్మ నాన్నలు విడిపోయారు.. ఆ సమయంలో ఓ వ్యక్తి దగ్గరయ్యాడు : హారిక

Bigg Boss 4 Telugu week 10 Harika About Her Love story

బిగ్ బాస్ షోలో నిన్నటి ఎపిసోడ్‌లో కంటెస్టెంట్ల రహస్యాలను బయటకు లాగాడు. ఉత్తరాల పేరు చెప్పి జీవితంలో ఎవ్వరితోనూ షేర్ చేసుకోని ఓ సీక్రెట్ చెప్పాలని కండీషన్ పెట్టాడు. అలా చెబితేనే ఇంటి సభ్యులు పంపిన సందేశాలు మీ చేతుల్లోకి వస్తాయని అన్నాడు. ఇక ఇంటి నుంచి వచ్చిన ఉత్తరాల కోసం కంటెస్టెంట్లు కొన్ని సీక్రెట్స్ చెప్పి మూల్యాన్ని చెల్లించుకున్నారు. అందులో హారిక మాత్రం అదిరిపోయే సీక్రెట్స్‌ను చెప్పింది.

Bigg Boss 4 Telugu week 10 Harika About Her Love story
Bigg Boss 4 Telugu week 10 Harika About Her Love story

హారిక అమ్మ నాన్నలు విడిపోయారు వేరుగా ఉంటున్నారన్న సంగతి ఇదివరకు చెప్పేసింది. ఆ సమయంలో హారిక తండ్రి వద్ద కొన్ని రోజులు ఉందన్న సంగతి తెలిసిందే. అయితే తల్లిదండ్రులు అలా దూరంగా ఉంటే పిల్లలకు ప్రేమ కరువు అవుతోంది. ఎవరైనా కాస్త ప్రేమ చూపిస్తే ఇట్టే కరిగిపోతారు. హారిక కూడా అలానే ఓ వ్యక్తి ప్రేమలో పడిపోయిందట. ఈ విషయాన్ని గత ఆరేళ్ల నుంచి అమ్మతో చెప్పాలనుకుందట కానీ భయపడి చెప్పలేదట.

ఇలా బిగ్ బాస్ ద్వారా చెప్పే అవకాశం వచ్చిందని అసలు విషయాన్ని చెప్పింది. ఓ నాలుగున్నరేళ్ల క్రితం ఓ రెండేళ్ల పాటు ఓ వ్యక్తితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ఇది మా అమ్మకు కూడా తెలీదు. ఇదొక్కటే నేను ఇంత వరకు దాచి పెట్టాను.. ఇప్పుడు ఎలాంటివి లేవు.. కెరీర్ మీదే ఫోకస్ పెట్టాను క్షమించు అమ్మ అని హారిన తన సీక్రెట్‌ను అలా బయటపెట్టేసింది.