బిగ్‌బాస్‌లో మూడో రోజూ అంతే గందరగోళంగా గడిచింది. ఎందుకు గొడవపెట్టుకుంటున్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? అర్థం కాకుండా చేపల మార్కెట్ల గొడపెట్టుకున్నారు. రోజంతా ఫుడ్ లభించలేదని నైబర్ రూం నుంచి ఆరియానా, సోహెల్ రావడం, మిగతా హౌస్‌మేట్స్‌తో గొడవ పెట్టుకోవడంతో రచ్చ రచ్చగా మారింది. ఇక చివరకు అందరూ కలిసి ఆ ఇద్దరికి ఫుడ్ ఆఫర్ చేయడం, తినమని చెప్పడంతో మరో గొడవ మొదలైంది.
ఆరియానా తినకుండా మారాం చేస్తూ ఎవరో ఒకరు తనకు తినిపించాలని అప్పుడే తింటానని అనడంతో అఖిల్, కరాటే కళ్యాణి తినిపించారు. అయితే ఇది మిగతా హౌస్‌మేట్స్ నచ్చలేదు. ఆరియానా చేసేది టాస్క్ అయితే మనమంతా ఓడిపోతాం. ఎందుకు తినిపిస్తున్నారంటూ ఆ ఇద్దరిని మందలించారు. కానీ కరాటే కళ్యాణి మాత్రం కాస్త ఓవర్ చేసింది. తనకు ఎవరైనా ఆకలి ఉంటో చూడలేనని, పస్తులు ఉంటే ఎలా ఉంటుందో తనకు తెలుసని కరాటే కళ్యాణి చెప్పుకొచ్చింది.
ఆ మాటలు వినేసరికి దేవీ నాగవల్లి అక్కటి టక్కున లేచిపోయింది. ఆ వెంటనే అభిజీత్ లేచి వెళ్లిపోయాడు. వారిద్దరూ ఇలా వెళ్లిపోవడంతో కరాటే కళ్యాణి హర్ట్ అయింది. ఏడ్వడం ప్రారంభించింది. ఇక ఈ విషయంపై సూర్య కిరణ్‌తోనూ ముచ్చటించింది. ఇక సూర్య కిరణ్ చెప్తుంటే ఎంతకీ వినకపోవడంతో.. నాకు ఒక్క నిమిషం చెప్పేది వినండి.. ఒక్క నిమిషం కంటే ఎక్కువైతే చెప్పుతో కొట్టు అంటూ కరాటే కళ్యాణిని అన్నాడు. అయినా సరే ఆమె వినకుండా తన ధోరణిలోనూ నడుచుకుంది. ఏడుస్తూనే ఉంది. మొత్తానికి కరాటే కళ్యాణి దిగ్విజయంగా మూడో రోజూ ఏడుస్తూనే ఉంది. మోనాల్ మాత్రం ఏడ్వకుండా ఉండటమే మూడో రోజు విశేషం.