బిగ్ బాస్ షోలో అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు. మూడో వారంలో ఇంట్లోకి వచ్చినా కూడా అందరితో ఈజీగానే కలిసిపోయాడు. తన కామెడీతో అందర్నీ నవ్వించాడు. ఇంటా బయటా కూడా అవినాష్ అందర్నీ నవ్వించాడు. అయితే ఈ కామెడీ చేసే క్రమంలో కొంతమంది హర్ట్ అయ్యారు కూడా. అలకలు, ద్వేషాలు, కోపాలు కూడా ప్రదర్శించారు. అవినాష్ అందరి దగ్గరకు వెళ్లి క్షమాపణలు చెప్పాడు. గతంలో మోనాల్, సుజాతలను ఇమిటేట్ చేసిన సందర్భంలో వారు హర్ట్ అయ్యారు.
ఇమిటేషన్ చేయడం తప్పు కాదు.. కానీ అవతలి వారి మనసు నొప్పించుకుండా చేయాల్సి ఉంటుంది. అలా ఇమిటేట్ చేసి జబర్దస్త్ షోలో కూడా ఎన్నో వివాదాలు, గొడవలు, కొట్టేవరకు వెళ్లాయి. మొన్నటికి మొన్న బొమ్మ అదిరింది షోలో వైఎస్ జగన్‌లా ఇమిటేట్ చేస్తే అది ఎంత రచ్చ అయిందో అందరికీ తెలిసిందే. అలా ఇమిటేషన్‌లు అన్ని సార్లు వర్కవుట్ కాదు. మరీ ముఖ్యంగా అవతలి వారి బాధను ఇమిటేట్ చేసి మిగతా వారికి నవ్వులు పంచుదామనుకుంటే అది కుదరదు.
అలాగే నోయల్ తనకున్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ కుంటుతూ నడుస్తుంటే దాన్ని అవినాష్ కామెడీ చేసేశాడు. ఇమిటేట్ చేసి అందర్నీ నవ్వించాడు. ఇదే విషయంలో నోయల్ మందలిస్తే క్షమించని అడిగి సింపుల్‌గా వదిలేస్తే సరిపోయేది. కానీ దానికి అవినాష్ అంత ఎత్తున లేచి, మిమిక్రీ చేసేవాళ్లందర్నీ తప్పుపడుతున్నావ్.. కామెడీ చేసే వాళ్లందర్నీ అంటున్నావ్ అంటూ ఓ వర్గాన్ని మధ్యలోకి తీసుకొచ్చాడు. కామెడీ చేయొద్దంటే నన్ను ఎందుకు తీసుకున్నారు షోలోకి అంటూ రివర్స్ ప్రశ్నలు వేసి తనది తానే ఇమేజ్ డౌన్ చేసుకున్నాడు. ఏది ఏమైనా అవినాష్ ప్రవర్తించిన తీరు మాత్రం అందరిలోనూ నిరాశే కలిగింది.