బిగ్‌బాస్ షోలో మోనాల్‌ది ఓ టిపికల్ క్యారెక్టర్. ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎవరితో ఉంటుంది? ఏం మాట్లాడుతుందో చెప్పడం చాలా కష్టం. ఒకసారి అభిజిత్‌తో క్లోజ్‌గా ఉంటుంది. ఇంకోసారి అఖిల్‌తో క్లోజ్‌గా ఉంటుంది. ఈమె వ్యవహారం ఎప్పటికీ తేలదు. అభిజిత్‌తో నువ్వంటే ఇష్టమని చెబుతుంది.. అఖిల్‌కు హగ్గులు, కిస్సులు ఇస్తుంది. ఇలా ఈ ఇద్దరినీ తన వైపుకు తిప్పుకుంటుంది. ఇవన్నీ కాసేపు పక్కన బెడదాం.
మామూలుగా బిగ్ బాస్ షోకు కావాల్సింది గ్లామర్ డోస్. ఇలా ట్రాకులు నడుపుతూ కొద్దో గొప్పో అందాలను ఆరబోస్తూ ఉంటే చివరి వరకు ఉంటామనేది ఓ నమ్మకం. అందుకే బిగ్ బాస్ షోలో కొందరు కేవలం వాటి మీద ఆధారపడి ఉంటారు. అందులో ఈ సారి వచ్చిన కంటెస్టెంట్లలో హారిక, అరియానా,మోనాల్, దివి అంటూ ఇలా చాలానే గ్లామర్‌ను నింపాడు బిగ్‌బాస్. ఇందులో మరీ ఎక్కువగా అంటే అరియానా, మోనాల్ పొట్టి పొట్టి బట్టలతో దుమ్ములేపుతారు.
అయితే ఈ ఆదివారం మాత్రం మోనాల్ కాస్త హద్దు మీరింది. ఆమె వేసిన డ్రెస్ మరీ వల్గర్‌గా ఉంది. ఆమె చేసిన క్లీవేజ్ షోతో ఫ్యామిలీ ఆడియన్స్ తల పట్టుకునే వరకు వచ్చింది. ఆమె అందాల ఆరబోతో నెట్టింట బాగానే రచ్చైంది. అయితే ఓట్ల కోసమే ఇలా చేస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరీ ఇంత దిగజారాలా? అంటూ నెటిజన్లు మోనాల్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ఆదివారం మోనాల్ చేసిన రచ్చ ఇప్పటికీ తగ్గడం లేదు. మోనాల్ హాట్ ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.