బిగ్‌బాస్ హౌస్‌లో మోనాల్ అఖిల్ గురించి ఎలాంటి చర్చలు వస్తాయో అందరికీ తెలిసిందే.బయట కూడా అందరూ వీరిద్దరి రహస్య బంధంపై కామెంట్లు చేస్తూనే ఉంటారు. బిగ్‌బాస్ షోలో ప్రసారమయ్యే దాంట్లో దాదాపు సగానికి పైగా పుటేజ్ వీరిదే ఉంటుంది. నిత్యం అఖిల్-మోనాల్ ముచ్చట్లే చూపిస్తుంటారు. ఇక వీరిద్దరిపై హౌస్ మేట్స్ సైతం చెవులు కొరుక్కుంటారు. లాస్య సుజాత అయితే వీరిద్దరి మధ్యలో ఏదో నడుస్తోందని ఫిక్స్ అయ్యారు.
జబర్దస్త్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చినప్పటికి అందరితో కలిసిపోయాడు. వచ్చీ రావడంతోనే మోనాల్‌కు లైన్ వేశాడు. ఆల్రెడీ మోనాల్ అఖిల్ అభిజీత్ ట్రాక్ తెలుసు కాబట్టి.. అలా ఊరికే ఆమెతో పులిహోర కలిపేందుకు ట్రై చేశాడు. ఇక నిన్నటి టాస్క్‌లోనూ మోనాల్‌ను ఇష్టపడే ఫ్యాన్‌గా అవినాష్ రెచ్చిపోయి నటించేశాడు. అదంతా బాగానే ఉంది.
ఇక చివర్లో ఇంటి సభ్యులంత సరదాగా కూర్చున్నారు. అందరి కోరిక మేరకు అవినాష్.. మోనాల్, అఖిల్‌లా నటించి చూపించాడు. వారి మ్యానరిజం, నడక ఇలా పలుమార్లు ఇమిటేట్ చేసి చూపించాడు. ఈ విషయంలో మోనాల్ తెగ హర్ట్ అయింది. అలా ఒకసారి చేయడం ఓకే గానీ పదే పదే చేయడం చాలా బాధగా అనిపిస్తోంది నాకు నచ్చలేదని మోనాల్ చెప్పుకొచ్చింది. ఏడుస్తున్నావా? అని అవినాష్ మోనాల్‌ని అడిగాడు. కాదు కోపం వస్తోంది అని మోనాల్ ఫీల్ అయింది. అవినాష్ సారీ చెప్పేసరికి మోనాల్ కాస్త శాంతించింది.