Bigg Boss 4 Telugu: అభిజిత్-హారిక రొమాన్స్.. చూడలేక వెళ్లిపోయిన లాస్య!

బిగ్ బాస్ షోలో ప్రస్తుతం హారిక అభిజిత్ లాస్య ఓ జట్టుగా ఉంటున్నారు. మధ్యలో అఖిల్ వచ్చినట్టు కనిపిస్తుంది. ఈ మధ్య అఖిల్ హారికలు క్లోజ్ అయినట్టు కూడా అనిపిస్తుంది. అయితే ఏది ఏమైనా గానీ హారిక లాస్య అభిజిత్‌లు ముగ్గురు ఒకే చోట కూర్చుని మాట్లాడుకుంటారు. గార్డెన్ ఏరియాలో ఉన్న కుర్చీలో కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటారు. నిన్నటి ఎపిసోడ్‌లో కూడా అలాగే జరిగింది. కానీ టాపిక్ మాత్రం కాస్త రొమాంటిక్‌గా మారింది.

Bigg Boss 4 Telugu Lasya Stay Away For Harika Abhijeet Hugs Discussion
Bigg Boss 4 Telugu Lasya Stay Away For Harika Abhijeet Hugs Discussion

బిగ్ బాస్ ఇంట్లో హారిక అభిజిత్ మధ్య ఉన్న రిలేషన్ గురించి అందరికీ తెలిసిందే. కేవలం ఫ్రెండ్స్ అని చెబుతున్నా.. అంతకు మించి అని కనిపిస్తూనే ఉంది. ఫ్యామిలీతో పాటు సరి సమానంగా చూశాను.. అందుకే నామినేషన్‌లో ఎటూ తేల్చుకోలేకపోయాను అని సమంతతో చెప్పింది. అయితే నీకు అభిజిత్ ఫ్యామిలీ రెండూ సమానమేనా? ఎవరు ఎక్కువ అని అడిగిసేంది. ఫస్ట్ ఫ్యామిలీయే అని తడుముకోకుండా హారిక సమాధానం చెప్పింది.

అయితే నిన్నటి ఎపిసోడ్‌లో ఈ ముగ్గురు ఒకచోట కూర్చున్నారు. లాస్య సైలెంట్‌గా ఉండి వీరి మాటలు, ముచ్చట్లను వింటూ ఉంది. హగ్గులివ్వడం లేదని అభిజిత్ హారికను టార్గెట్ చేశాడు. ఈ మధ్య నాకు హగ్గులు ఇవ్వడం లేదు.. అఖిల్‌కు ఇస్తున్నావ్.. అసలు నాకు హగ్గు ఇచ్చిన ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? అంటూ మాట్లాడుకున్నారు. ఈ టాపిక్ ఎక్కడికో వెళ్తున్నట్టు అనిపించిన లాస్య అక్కడి నుంచి జారుకుంది. సైలెంట్‌గా వారిద్దరిని అలా విడిచి అక్కడి నుంచి వెళ్లిపోయింది.