బిగ్‌బాస్‌లో ‘కట్టప్ప’!!.. ఇంటి సభ్యుల్లో ముసలం

Bigg Boss 4 Telugu Is There Any Kattappa Amongst Contestants

బిగ్‌బాస్ మామూలుడో కాదు. ఇంట్లో ఉన్నవారిని ఊరికే ప్రశాంతంగా ఉండనివ్వడు. ఎప్పుడూ ఏదో టాస్క్ అంటూ పరుగులు పెట్టిస్తూ ఉంటాడు. లేదా సీక్రెట్ టాస్క్‌లంటూ అందర్నీ బుక్ చేసేస్తూ ఉంటాడు. కంటెస్టెంట్ల మధ్య చిచ్చులు పెట్టాలని ప్రతీ విషయాన్ని వాడుకుంటాడు. ఇక బిగ్‌బాస్  విసిరిన వలలో కంటెస్టెంట్లు కచ్చితంగా చిక్కుతారు. చిక్కాల్సిందే. ఇదే స్ట్రాటజీని బిగ్‌బాస్ నిన్న వాడేశాడు.

Bigg Boss 4 Telugu Is There Any Kattappa Amongst Contestants
Bigg Boss 4 Telugu Is There Any Kattappa Amongst Contestants

ఎపిపోడ్ చివర్లో ఇంటి సభ్యుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. చివర్లో ఇచ్చిన పంచ్‌తో అందరిలోనూ ముసలం మొదలైంది. ఆ చందమామకు మచ్చ ఉన్నట్టు.. ఈ ఇంట్లోనూ ఓ మచ్చ ఉంది.. మీలో ఒకరే అది.. ఓ కట్టప్ప ఉన్నాడు.. అది ఎవరైనా కావచ్చు అంటూ అందరి మీద అనుమానం కలిగించేశాడు. అయితే ఆ కట్టప్ప ఎవరై ఉంటారా? అని అప్పుడే ఒకరిపై ఒకరు ఆనుమానాలు, కౌంటర్లు వేయడం ప్రారంభించేశారు.

బిగ్‌బాస్‌కు కావాల్సింది కూడా ఇదే. హౌస్‌మేట్స్ మధ్య అభిప్రాయ బేధాలు, గొడవలు రావాలి.. అప్పుడు వారు ఎలా ప్రవర్తిస్తారు.. ఆ కోపంలో ఏం చేస్తారు? ఇవన్ని ప్రేక్షకులకు చూపించేందుకు ఇలాంటి ట్రిక్స్ వేస్తుంటారు. మరి ఇంతకీ ఆ కట్టప్ప నిజంగానే ఉన్నాడా? ఉంటే ఎవరు? అతని పని ఏంటి? అని నెటిజన్లు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. మరి చూడాలి రానున్న రోజుల్లో అసలు సంగతి బయట పడనుంది.

Bigg Boss 4 Telugu Is There Any Kattappa Amongst Contestants
Bigg Boss 4 Telugu Is There Any Kattappa Amongst Contestants

ఇక ఇప్పటికే మొదటి వారం నామినేషన్ ప్రక్రియ కూడా మొదలైంది. గంగవ్వ, సూర్య కిరణ్, దివి, మెహబూబ్, అఖిల్ సర్తాక్, సుజాత, అభిజీత్ నామినేట్ అయ్యారు. ఆల్రెడీ ఓట్ల వర్షం కూడా కురుస్తోంది. వాటిలో గంగవ్వ జెట్ స్పీడ్‌లో దూసుకుపోతూ ఉంటే.. సూర్య కిరణ్, దివిలు వెనుకపడ్డారు. దాదాపు ఫస్ట్ ఎలిమినేట్ అయ్యేది సూర్య కిరణే అని టాక్ వినిపిస్తోంది. మరి చూడాలి ఈ వారంలో ఏదైనా మిరాకిల్ జరుగుతుందేమో.