తెలుగు బుల్లితెర పాప్‌లర్ రియాల్టీ షో బిగ్‌బాస్. వరుసగా మూడు సీజన్‌లు హిట్ టాక్ సాధించి నాలుగో సీజన్ కూడా అట్టహాసంగా ప్రారంభమైంది. ఇప్పటికీ రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ పాపులర్ షో విజయవంతంగా మూడో వారంలోకి అడుగుపెట్టింది. ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్ ఒకరికొకరు దగ్గరవుతుండగా మరోవైపు కంటెస్టెంట్‌లకు అభిమానులు కనెక్్ట అవుతున్నారు. ముఖ్యంగా బిగ్‌బాస్ హౌజ్‌లోకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ గురంచి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకు విపరీతమైన క్రేజ్‌ను గంగవ్వ సొంతం చేసుకుంటోంది.
ఇక గంగవ్వకు కూడా ఇప్పుడిప్పుడే బిగ్‌బాస్ ఆట అర్థమవుతోంది. తొలి రెండు వారాలు ఎలిమినేషన్‌లో ఉన్నా అత్యధిక ఓటింగ్‌తో ఎలిమినేషన్ గండం నుంచి సులువుగా బయటపడింది. ఇక గంగవ్వకు ఉన్న క్రేజ్, ప్లస్ పాయింట్స్‌తో మిగతా కంటెస్టెంట్లలోఒకరకమైన అయోమయం నెలకొంది. ఎందుకుంటే గంగవ్వకు సంబంధించిన ఎలాంటి పొరపాటు చేసినా ఆమె ఫ్యాన్స్‌కు టార్గెట్ అవుతామనే భయంతో ఉన్నట్లు టాక్.
దీంతో గంగవ్వతో జాగ్రత్తగా మర్యాదగా, ప్రేమగా వ్యవహరించాలని మిగతా బిగ్‌బాస్ హౌజ్‌మేట్స్ భావిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకుంటే ఇప్పటికే మిగిలిన హౌజ్‌మేట్స్ మధ్య గొడవలు, అలకలు మొదలైన విషయాన్ని గుర్తించి ఉండే ఉంటారు. ప్రస్తుతం హౌజ్‌లో గంగవ్వ ఆడుతున్న ఆట, బయట ఉన్న క్రేజ్‌తో ఆమె ఫైనల్ వరకు ఉండటం ఖాయమని అంటున్నారరు. అయితే ఆమెకు ఆరోగ్యం సహకరిస్తే బిగ్‌బాస్ అభిమానులకు మరింత వినోదాన్ని అందిస్తున్నడంలో ఎలాంటి సందేహం లేదనడంలో అతిశయోక్తి లేదు.