బిగ్‌బాస్ నీ బాంచన్.. నేను పోతా.. గంగవ్వ ధీనస్థితి

బిగ్‌బాస్ షోలో గంగవ్వది స్పెషల్ క్యారెక్టర్. స్పెషల్ ట్రీట్మెంట్. షో మొదలైనప్పటి నుంచి బిగ్‌బాస్, నాగార్జున చెప్పేది ఒకటే. గంగవ్వను అందరూ బాగా చూసుకోవాలి అని. గంగవ్వకు సపరేట్ బాత్రూం అది కూడా బెడ్ పక్కనే. గంగవ్వను సకల అతిథి మర్యాదలతో చూసుకుంటున్నాడు. అసలే ఈ సీజన్‌లో పిజికల్ టాస్కులు కూడా లేవు. అందులోనూ గంగవ్వకు ఎలాంటి కష్టమైన టాస్కులు ఇవ్వడం లేదు. పాట పాడమనడం తప్పా.

Bigg Boss 4 Telugu Gangavva Will Go out WIth Sickness
Bigg Boss 4 Telugu Gangavva Will Go out WIth Sickness

గంగవ్వను ఎంత బాగా చూసుకున్నా సరే ఆ వాతావరణానికి ఇమడడం కుదరని పని. మట్టి వాసనలో, పొలాల గట్ల వెంబడి తిరిగిన ప్రాణం.. అలా నాలుగు గోడల మధ్య ఏసీ ఇంట్లో ఉంచితే గంగవ్వకు ఊపిరి ఆడుతుంతా?. ప్రస్తుతం గంగవ్వది అదే పరిస్థితి. ఇదే విషయాన్ని బిగ్‌బాస్‌తో చెప్పుకొచ్చింది. నా వల్ల అయితలేదు, బయట బండలు కూడా పగలకొట్టినా, ఇప్పుడు కూడా పగలగొడతా.. కానీ ఇక్కడ వాతావరణ పడతలేదు బిడ్డా.. నీ బాంచన్.. నేను పోతా అంటూ మొరపెట్టుకుంది.

గంగవ్వ తన బాధను వెల్లిబుచ్చుకున్నా బిగ్‌బాస్ మాత్రం మారలేదు. ఏం కంగారు పడకు.. చాలా గట్టిదానివి… ధైర్య వంతురాలివి.. అంటూ సముదాయించాడు. వైద్యులను పిలిపించి.. వైద్యం చేయిస్తాను.. త్వరలోనే తగ్గిపోతుంది.. కొత్తలో అలాగే ఉంటుందని సర్దిచెప్పేందుకు ప్రయత్నించాడు. ఇక చివరకు డాక్టర్ రూంలో గంగవ్వను ఉంచేశారు. అయితే మళ్లీ ఆరోగ్యం కుదుటపడి మామూలు గంగవ్వలా వస్తుందో లేదో చూడాలి.