లంగతనం అంటివి మళ్లీ మాట మార్చితివి కద గంగవ్వ!!

బిగ్‌బాస్ నాల్గో సీజన్‌లో అత్యంత ప్రజాధరణ పొందిన సెలెబ్రిటీ గంగవ్వ. షోలో పార్టిసిపేట్ చేయక ముందే ఎంతో క్రేజ్ ఉంది. మట్టి వాసన, తెలంగాణ యాస ఇలా గంగవ్వను ఎంతో పాపులర్ చేసింది. ఇక గంగవ్వను బిగ్‌బాస్ షోలో తీసుకున్నారంటే అది గంగవ్వకు ప్లస్ కాదు.. షోకే ప్లస్ అవుతుంది. షోను బూస్టప్ చేసేందుకే గంగవ్వను తీసుకున్నారు. అది కూడా బాగానే వర్కౌట్ అయింది. గంగవ్వను బేస్ చేసుకుని ప్రోమోలను కట్ చేశారంటేనే ఆమె ఫాలోయింగ్, క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

Bigg Boss 4 Telugu Gangavva Changed Her Opinion Of Kattappa

మొదటి రెండు రోజులు బిగ్‌బాస్ ప్రోమోలు గంగవ్వ మీదే వచ్చాయి. ఆమె వేసే డైలాగ్‌లను స్టార్ మా వారే మీమ్స్ టైప్‌లో ఎడిట్ చేసి మరీ వదిలారు. అదీ గంగవ్వ రేంజ్. అయితే గంగవ్వకు గేమ్ ప్లాన్స్, స్ట్రాటజీలు వంటివి ఏమీ తెలియకపోవచ్చు. అలాంటి మైండ్‌లో ఉంచుకున్నా తప్పులేదు. అయితే మాటలు మార్చితే మాత్రం మొదటికే మోసం వస్తుంది. తాజాగా గంగవ్వను కూడా ఇదే విషయంలో పట్టేశారు.

Bigg Boss 4 Telugu Gangavva Changed Her Opinion Of Kattappa

కట్టప్ప విషయంలో గంగవ్వ మాట మార్చేసింది. కట్టప్ప కోసం మూడు టాస్కులు పెట్టగా గంగవ్వ మాట మార్చేసింది. మొదటి సారి కార్డ్‌పై పేరు రాసేటప్పుడు అఖిల్‌ను కట్టప్పగా భావించింది. రెండో సారి ఆరియానా, సోహెల్‌కు కట్టప్ప గురించి వివరిస్తూ అఖిల్ పేరే చెప్పింది. తాను మాట మార్చనని, మార్చితే అది లంగతనమైతది అని చెప్పుకొచ్చింది.

Bigg Boss 4 Telugu Gangavva Changed Her Opinion Of Kattappa

రాత్రంతా మేల్కొని ఉంటాడు అందరిని చూసుకుంటాడు, జాగ్రత్తగ కాపాడుతాడంటూ గంగవ్వ అఖిల్‌ను కట్టప్పగా పేర్కొంది. ఇక నిన్నటి టాస్క్‌లో గంగవ్వ మాట మార్చేసింది. తన దృష్టిలో కట్టప్ప అంటే అమ్మ రాజశేఖర్ అని అతనికి స్టాంప్ వేసింది. అయితే గంగవ్వ ఇలా తన ఉద్దేశ్యాన్ని మార్చుకోవడంలో తప్పేమీ లేకపోవచ్చు. కానీ షో చూసే జనాలకు మాత్రం గంగవ్వ మాట మార్చేసినట్టుగానే కనిపిస్తోంది. లంగతనం అంటూ పెద్ద డైలాగ్‌లు చెప్పి చివరకు ఇలా చేసేసిందేంటని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.