బిగ్ బాస్ 4 : కంట్లో నీళ్ళు తిరిగే దివి బ్రేకప్ లవ్ స్టోరీ .. ఇంత క్యూట్ అమ్మాయి కి అంత కష్టమా

Divi Heart Breaking Love Story

బుల్లితెరపై బిగ్‌ బాస్‌ షోకు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్ని రియాల్టీ షోలు ఉన్నా ఈ షోకు సాటి రాదు అనే విదంగా ఉంటుంది. టీఆర్పీ రేటింగ్‌లు చూస్తే ఇదే అర్థమవుతుంది. ఇక ఈ రియాల్టీ షోలో పాల్గొని తమని తాము నిరూపించుకోవాలని సెలబ్రెటీలు ఉవ్విళ్లూరుతుంటారు. ఇక తాజా బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌లో పాల్గొని ముఖ్యంగా కుర్రకారు మనసులను దోచుకుంటున్న కంటెస్టెంట్‌ దివి ఒకరు. షో ప్రారంభమైన మూడు రోజుల తర్వాత మాట్లాడి ఇంటి సభ్యులతో పాటు బిగ్‌బాస్‌ అభిమానుల మనసు దోచుకుంది ఈ భామ. ఇక అప్పట్నుంచి ఆమె చేస్తున్న సందడి మామూలుగా ఉండటం లేదు.

Divi Heart Breaking Love Story
Divi Heart Breaking Love Story

బిగ్‌బాస్‌లో సందడి చేస్తూ అందరికీ వినోదాన్ని అందిస్తున్న దివి జీవితంలో ఓ చేదు సంఘటన ఉంది. అదే లవ్‌ ఫెయిల్యూర్‌, ఓ సందర్బంలో మాట్లాడుతూ.. ‘గతంలో నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. కొన్నాళ్ల పాటు రిలేషన్‌లో ఉన్నాం. తర్వాత విడిపోయాం. ప్రస్తుతం నేను ఎటువంటి రిలేషన్ షిప్‌లో లేను. సింగిల్‌గా ఉండటమే బాగుంది. అదే బెటర్ అని ఫిక్సయ్యాను. సింగిల్‌గా ఉంటే మనకు నచ్చినట్టు ఉండొచ్చు.. సంతోషంగా ఉండొచ్చు. నేను రిలేషన్ షిప్‌లో ఉన్నప్పుడు కూడా కరెక్ట్ గానే ఉన్నాను.. కానీ ఇద్దరి మధ్య కొన్ని అనుకోని పరిస్థితులు ఏర్పడటం వల్ల బ్రేకప్ అవ్వాల్సి వచ్చింది.

అతని ఫ్యామిలీలో చిన్న ఇష్యూ వచ్చి పడింది. ఇప్పటికీ అతని పై నాకు మంచి అభిప్రాయమే ఉంది. నిజంగా అతను చాలా మంచి వ్యక్తి. ఆ అబ్బాయి.. తమ్ముడు దురదృష్టవశాత్తు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. దాంతో అతని ఇంట్లో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఆ టైములో తనతో పాటు వాళ్ల పల్లెటూరికి రమ్మని నన్ను అడిగాడు. కానీ నేను వెళ్లలేదు. నేను చిన్నప్పటి నుండీ హైదరాబాద్‌లోనే పెరగడం వల్ల పల్లెటూరు నాకు అలవాటు లేదు. అయినా అతని కోసం వెళ్లేదాన్నేమో..! కానీ నాకు ఇష్టమైన మోడలింగ్.. ఇంకా సినిమాలు వదిలేయమని అతను నాతో చెప్పాడు.అది నాకు ఇష్టం లేదు. అందుకే విడిపోయాం’ తన బ్రేకప్‌ లవ్‌స్టోరీని వెల్లడించింది.