బిగ్‌బాస్ షోలో అతి పని చేయదు. అతి మంచితనం, అతి కోపం, అతి ప్రేమ, అతి ద్వేషం ఇలా ఏదీ కూడా బిగ్ బాస్ ఆటలో పని చేయదు. ఇందులో ఏది చేసినా ఆటలోంచి బయటకు రావాల్సిందే. అలా అతి చేశాడు కాబట్టే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఉక్కు హృదయం టాస్క్‌లో మెహబూబ్ చేసిన అతిని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోయారు. బాడీ తప్పా బ్రెయిన్ పెరగలేదని ట్రోల్ చేశారు.
దమ్ముంటే నన్ను తీసుకెళ్లండిరా, నా దగ్గర చార్జింగ్ పెట్టుకోండిరా అంటూ ప్రగల్భాలు పలికాడు. అందుకే ప్రజలు తిరస్కరించారు. అవును నిజమే. ఈ మూడో వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ మెహబూబే. ఈ మేరకు సోషల్ మీడియాలో లీకులు జోరందుకున్నాయి. మామూలుగా అయితే ఈ వారం దేవీ నాగవల్లి, ఆరియానా, కుమార్ సాయి ఇలా ఎవరో ఒకరు వెళ్తారని అంతా భావించారు.
కానీ ఆ ఒక్క టాస్క్ వల్ల మెహబూబ్ కథ కంచికి చేరింది. ఆట ఎలా ఆడాలి? ఎక్కడ ఎంతలా రియాక్ట్ అవ్వాలి అన్న విషయాలేవీ తెలియకపోవడంతో మెహబూబ్ ఎలిమినేట్ కావాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే నిజంగానే మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడా? లేదా? ఎలిమినేట్ అయితే మిగతా కంటెస్టెంట్ల గురించి ఎలాంటి కామెంట్లు చేస్తాడు? బిగ్ బాంబ్ ఎవరి మీద వేస్తాడు? ఇలాంటవన్నీ తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సింది.