బిగ్‌బాస్ నాల్గో సీజన్‌ను ఫాలో అవుతున్న వారికి అఖిల్, మోనాల్, అభిజీత్ మధ్య ఉన్న రహస్య బంధంపై ఓ కన్ప్యూజన్ ఏర్పడి ఉంటుంది. ఆ ఇద్దరూ మోనాల్‌పై దృష్టి పెట్టడం, మోనాల్ ఏదీ క్లియర్‌గా చెప్పకపోవడం ఇాద్దరితోనూ క్లోజ్‌గానే ఉండటంతో అందరికీ ఎక్కడా లేని అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితిలోనూ మోనాల్ చేసే కొన్ని పనులు అఖిల్‌పై ఉన్న ప్రేమను వ్యక్తం చేస్తున్నాయి.
అఖిల్‌తో కాస్త ఎక్కువ సమయం గడపడం, గోరు ముద్దలు తినిపించడం, అన్ సీన్‌లో భాగంగా వీరిద్దరూ కిచెన్‌లో ఉంటూ గోరు ముద్దలు తినిపించుకుంటూ ఉండడం, మీ ప్రేమను తగిలెయ్యా అంటూ లాస్య కౌంటర్ వేయడం, డైనింగ్ టేబుల్ వద్ద అందరూ కూర్చుని తింటుంటే.. మోనాల్ మాత్రం అఖిల్‌కు వడ్డించడం, అతనేమో ఆమెకు తినిపించడం లాంటివి చేయడం ఇవన్నీ చూసిన ప్రేక్షకులను వీరిద్దరి మధ్యే ట్రాక్ నడుస్తోందని అర్థమవుతోంది.
ఇక అభిజీత్‌తోనూ కాస్త క్లోజ్‌గా మూవ్ అవుతూ ఉంటే అఖిల్ ఫేస్‌లో మార్పులు వస్తుంటాయి. అలాంటిది మోనాల్ వేరే వారితో హాట్ హాట్ స్టెప్పులు వేస్తే గుండె పగిలిపోదా?. ప్రస్తుతం అదే జరిగినట్టు కనిపిస్తోంది. సోహెల్‌తో మోనాల్ చేసిన హాట్ పర్ఫామెన్స్‌తో అఖిల్ మొహం కందిపోయినట్టైంది. ఈ మేరకు అఖిల్‌పై నెటిజన్లు జాలి చూపిస్తున్నారు. మరి నేటి ఎపిసోడ్‌లో వీరి మధ్య ఎలాంటి చర్చలు వస్తాయో చూడాలి.