అభిజీత్ దెబ్బ అదుర్స్.. గొంతుచించుకున్న మోహబూబ్, సోహెల్

బిగ్‌బాస్ షోలో ఉండాల్సిన మజా, ఆ ఎనర్టీ నిన్నటి ఎపిసోడ్‌లో వచ్చింది. ఆటలు అసలైన ఎత్తులు, నమ్మించి వంచించడం, ఒకరిపై ఒకరు విరుచుకుపడి భీరాలకుపోవడం.. అబ్బో ఇలా ఒకటా రెండా నిన్నటి ఎపిసోడ్ అందరికీ కన్నులవిందుగా అనిపించింది. మరీ ముఖ్యంగా రోబో టీం మేట్ అయిన అభిజీత్ వేసిన మాస్టర్ ప్లాన్‌కు.. మనుషుల టీం గిలగిల కొట్టేసుకుంది. ఒక్కొక్కరు చొక్కాలు చించుకుని రెచ్చిపోయారు.

మాకే కండలున్నాయ్.. బలం ఉందని తెగ రెచ్చిపోయారు. డోర్ తెరిస్తే ఇక రక్తపాతాళే అన్నట్టు వార్నింగ్‌లు ఇచ్చారు. దమ్ముంటే నన్ను తీసుకెళ్లండిరా? నా దగ్గర చార్జింగ్ పెట్టుకోండి అంటూ మెహబూబ్ రెచ్చిపోయాడు. కథ వేరేలా ఉంటుందని సోహెల్ ఓ రేంజ్‌లో ఊగిపోయాడు. ఆడవాళ్లను అడ్డం పెట్టుకుని ఆడుతున్నాడంటూ అఖిల్ వీర లెవెల్‌లో రెచ్చిపోయాడు. ఇక మోనాల్, సుజాత చేసిన ఓవరాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.

మనుషులు ముఖ్యంగా ఆట ముఖ్యమా అంటూ అమ్మ రాజశేఖర్ చేసిన యాక్షన్ కూడా బాగానే పండింది. ఎందుకు అలా మొత్తుకుంటున్నారు.. ఎందుకు అలా ఏడుస్తున్నారో ఎవ్వరికీ అర్థం కాలేదు. తీరా డోర్ తెరిశాక యుద్దం జరుగుతుందని అంతా భావించినా.. మాటలే గానీ చేతల్లేవని మళ్లీ నిరూపించుకున్నారు. మొత్తానికి కిడ్నాప్ చేసి చార్జింగ్ పెట్టేసుకుందామని అభిజీత్ వేసిన ప్లాన్‌తో గేమ్ మొత్తం రివర్స్ అయింది. రోబోల టీం గెలిచే చాన్స్ వచ్చింది. చూడాలి పూర్తి టాస్క్ అయ్యేలోపు ఎవరు విజయం సాధిస్తారో.