బిగ్ బాస్ 4: నాతో సమయాన్ని గడుపు.. హారికను వేడుకున్న అభిజిత్!

Bigg Boss 4 Telugu ABhijeet Please Spend Time with Me to Harika

బిగ్ బాస్ 4 షోలో అభిజిత్ హారికల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకానొక సందర్భంతో ఈ ఇద్దరినీ ఒక్కరిలానే చూశారు. అభిక అంటూ కొత్త పేరు పెట్టి వీరి క్యూట్ ఫ్రెండ్‌షిప్‌కు ఫిదా అయ్యారు. ఆనందం వచ్చినా బాధలు వచ్చినా ఒకరికోసం ఒకరు నిలబడ్డ తీరుకు అందరూ ఫిదా అయ్యారు. ఒకప్పుడు అభిజిత్‌ను విడిచి హారిక ఉండేది కాదు. కానీ ఇప్పుడు మాత్రం అభిజిత్ తప్పా మిగిలిన అందరితోనూ క్లోజ్‌గా ఉంటుంది. అయితే దీనికి కూడా ఓ కారణం ఉంది.

Bigg Boss 4 Telugu ABhijeet Please Spend Time with Me to Harika

హారికకు నాగార్జున బాగా క్లాస్ పీక్.. అభిజిత్‌ను తన దృష్టిలో విలన్‌ను చేసేశాడు. వీడియోలు చూపించి దూరం పెంచేశాడు. నీ గేమ్ నువ్ ఆడుకో అంటూ హెచ్చరించాడు. అప్పటి నుంచి హారిక మాత్రం అభిజిత్‌ను దూరం పెట్టేసింది. ఈ విషయం అందరికీ అర్థమవుతూనే ఉంది. నన్ను దూరం పెడుతోంది అంటూ అభిజిత్ వీకెండ్ ఎపిసోడ్‌లొ నేరుగానే నాగార్జునకు చెప్పాడు. అంటే హారిక చేష్టలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ వారంలోనూ అంతే.. సోహెల్ అఖిల్ మోనాల్‌లతోనే హారిక గడుపుతోంది.

బిగ్ బాస్ 4 షోలో అభిజిత్ హారికల బంధం

మరీ ముఖ్యంగా అఖిల్ అయితే హారిక మీద పడి హగ్గులు, కిస్సులు ఇచ్చేస్తున్నాడు. లేదా ఇవ్వమని బెదిరిస్తున్నాడు. ఇక తనతో టైం గడపడం లేదని బాగా ఫీలైన అభిజిత్ నిన్న రాత్రి ఆమె బెడ్ మీద ఓ లెటర్ రాసి పెట్టాడు. ప్లీజ్ స్పెండ్ టైం విత్ మీ (దయచేసి నాతో సమయాన్ని గడుపు) అని రాసి పెట్టి వెళ్లిపోయాడు. అది చూసిన హారిక అభిజిత్ బెడ్ మీదకు వచ్చి.. అతని పక్కలో పడుకుంది. సారీ అని చెప్పింది.. నువ్ నా క్యూటీ పై అంటూ ఐస్ చేసే ప్రయత్నం చేసింది. ఇక ఈ వారం హారిక చేసే చేష్టలు చూస్తుంటే.. ఎలిమినేట్ అయ్యేలానే కనిపిస్తోంది.