బిగ్ బాస్ తెలుగు షో.. ఇదివరకు కంటెస్టెంట్ల విషయంలో వివాదాల్లో నానే బిగ్ బాస్ షో.. తాజాగా కరోనా కేసులతో వార్తల్లోకెక్కుతోంది. బిగ్ బాస్ షో ప్రారంభం కాకముందే.. ఆ కంటెస్టెంట్ కు కరోనా వచ్చింది… ఈ కంటెస్టెంట్ కు కరోనా వచ్చింది.. ఇప్పుడెలా? షో ప్రారంభం అవుతుందా? లేక ఆగిపోతుందా? అంటూ వార్తలు గుప్పుమన్నాయి.
నిజానికి ఈ షో గత నెల 30నే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ.. కరోనా వల్లనే వాయిదా పడింది. ఇప్పుడు సెప్టెంబర్ 6న సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు.
బ్యాక్ టూ బ్యాక్ ప్రోమోలను కూడా వదులుతున్నారు. ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని బిగ్ బాస్ సీజన్ 4 కోసం అన్నింటినీ సిద్ధం చేసుకున్నారు.
కంటెస్టెంట్లను సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందరినీ క్వారంటైన్ కు పంపించారు. కరోనా టెస్టులు చేయించారు. అప్పుడు అందరికీ నెగెటివ్ వచ్చినా.. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉంచి టెస్టులు చేస్తే సింగర్ నోయల్ కు పాజిటివ్ వచ్చింది. దీంతో అతడికి సపరేట్ గా చికిత్స అందిస్తున్నారు.
కరోనాకు బయపడి హోస్ట్ నాగార్జున కూడా ఈ షో చేస్తాడో? లేదో అని అంతా టెన్షన్ పడ్డారు. కానీ.. కరోనా విషయంలో బిగ్ బాస్ యాజమాన్యం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుండటంతో కాదనలేకపోయాడు.
ఇక ఇంకో వారంలో షో ప్రారంభం కాబోతున్నది.. ఎటువంటి ఇబ్బందులు లేవు.. అని అనుకుంటుండగా.. యూట్యూబ్ స్టార్ అలేఖ్య హారికకు కరోనా పాజిటివ్ గా తేలింది.
తను దేత్తడి ప్రోగ్రామ్ తో యూట్యూబ్ లో ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు. తనకు యూట్యూబ్ లో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అందుకే హారికను బిగ్ బాస్ కంటెస్టెంట్ గా ఎంపిక చేశారు.
అయితే.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కూడా హారికకు కరోనా పాజిటివ్ ఎలా వచ్చిందో అర్థం కావడం లేదట. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కూడా తల పట్టుకుంటున్నారట. హారిక షో నుంచి తప్పుకుంటే షోకు పెద్ద మైనస్ అవుతుందని.. ఏం చేయాలా? అని బిగ్ బాస్ నిర్వాహకులు ఆలోచిస్తున్నారట.
అయితే.. హారికను ఎలాగైనా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇప్పించాలని.. ఆమెకు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్నారట. నిజానికి ఆమెకు ఇప్పుడు కరోనా సోకినా.. వెంటనే ట్రీట్ మెంట్ ప్రారంభించారు. నెల రోజుల్లో ఆమె రికవరీ అయ్యే చాన్స్ ఉంది. దీంతో షో ప్రారంభం అయిన తర్వాత 28 రోజులకు హారికను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి పంపించే ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి బిగ్ బాస్ నిర్వాహకులు ఈ షో కోసం బాగానే కష్టపడుతున్నారు కానీ.. మాయదారి కరోనా అన్ని హోప్స్ ను నాశనం చేసేస్తోంది.