మాసివ్ అప్డేట్ : “వార్ 2” రిలీజ్ డేట్ వచ్చేసింది..!

ఇప్పుడు బాలీవుడ్ సినిమా మళ్ళీ ఊపిరి పోసుకొని ఓ రేంజ్ హిట్స్ ని మళ్ళీ అందిస్తుంది. మెయిన్ గా ఈ 2023 లో అయితే బాలీవుడ్ హీరోస్ కి పట్టిందల్లా బంగారం అయ్యింది. కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ అయితే రెండు సెన్సేషనల్ హిట్ లు పైగా రెండు కూడా 1000 కోట్లకి పైగా వసూళ్లు సాధించాయి.

దీంతో ఇక ముందు రానున్న బాలీవుడ్ సినిమాలు కూడా భారీ అంచనాలు నెలకొల్పుకోగా ఆ చిత్రాల్లో ఓ సెన్సేషనల్ మల్టీ స్టారర్ కూడా ఉన్నాయి. కాగా ఆ చిత్రాల్లో ఏక్షన్ హీరో హృతిక్ హీరో మరియు టాలీవుడ్ మాస్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ల కలయికలో చేస్తున్న చిత్రం “వార్ 2” కూడా ఒకటి.

మరి ఈ సినిమా హృతిక్ గత చిత్రం వార్ కి సీక్వెల్ గా వస్తుండగా దర్శకుడు అయాన్ తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా ఇండియన్ సినిమా దగ్గర ఒక బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ కాగా ఇప్పుడు బాలీవుడ్ నుంచి ఈ సినిమా రిలీజ్ డేట్ వచ్చేయడం విశేషం. కాగా బాలీవుడ్ ప్రముఖ పి ఆర్ తరన్ ఆదర్శ్ తో అయితే సినిమా యూనిట్ ఈ సినిమా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు.

దీనితో ఈ సినిమా రానున్న 2025 సంవత్సరంలో ఆగస్ట్ 14న రిలీజ్ కాబోతున్నట్టుగా ఖరారు చేసేసారు. దీనితో నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ నుంచి పఠాన్, వార్, రీసెంట్ గా టైగర్ 3 చిత్రాల తర్వాత వార్ 2 రాబోతుంది అని చెప్పాలి. కాగా ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరలో కానీ వచ్చే ఏడాదిలో కానీ స్టార్ట్ కానుంది. మరిన్ని వివరాలు ముందు ముందు రానున్నాయి.