బిగ్ అప్డేట్ : ప్రభాస్ తో తగ్గేదేలే అంటున్న షారుఖ్ 

గడిచిన కొన్ని గంటల నుంచి అయితే ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ క్లాష్ లో భాగమైన పలు చిత్రాలు అయినటువంటి సలార్ అలాగే డున్కి చిత్రాల కోసమే ఓ రేంజ్ లో చర్చగా మారింది. కాగా ఎప్పుడైతే ప్రభాస్ సలార్ రిలీజ్ డేట్ సరికొత్తది అనౌన్స్ చేసారో అక్కడ నుంచే అదే డేట్ లో ఆల్రెడీ ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ సినిమా కోసం కూడా ఓ రేంజ్ లో చర్చగా మారింది.

కానీ నిన్న రాత్రి నుంచి అయితే ఈ చిత్రాల్లో షారుఖ్ సినిమా తప్పుకుంది అని రూమర్స్ స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ బిగ్గెస్ట్ క్లాష్ ఇపుడు క్లారిటీ బయటకి వచ్చింది. బాలీవుడ్ నుంచి పలు ట్రస్టడ్ వర్గాలు ఈ వార్తలను కొట్టి పారేసారు. డిసెంబర్ 22 న షారుఖ్ ఖాన్ నటించిన డున్కి రాబోతుంది అందులో ఎలాంటి సందేహం లేదని తేల్చి చెప్పేసారు.

దీనితో ఈ సెన్సేషనల్ క్లాష్ తప్పకుండ పడుతుంది అని దీనితో కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఓ పక్క ప్రభాస్ ప్రశాంత్ నీల్ మరో పక్క షారుఖ్ ఖాన్ మరియు రాజు హిరానీ లాంటి దర్శకుడు సినిమా కావడంతో దేనికదే హైప్ మాములుగా లేదు అందుకే ఈ క్లాష్ అయితే ఈ ఏడాదికి బిగ్గెస్ట్ క్లాష్ లలో ఒకటిగా కన్ఫర్మ్ చేసేసారు.

మరి ఫైనల్ గా పలు ట్విస్ట్ లతో ఈ సెన్సేషనల్ యుద్ధం తప్పనిసరి అని అర్ధం అయ్యిపోయింది. మరి ఈ రెండు చిత్రాలు సరిగ్గా రాణిస్తాయి లేక ఒకదాని కింద ఇంకొకటి పడి నలిగిపోతుందా అనేది తెలియాలి అంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే.