బిగ్ అప్డేట్ : “సలార్” ట్రైలర్ ఆగమనం ఎప్పుడంటే..!

ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో మాసివ్ హైప్ లో ఉన్న సరికొత్త చిత్రాల్లో అయితే భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటిస్తుండగా దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ చిత్రాన్ని అయితే తెరకెక్కిస్తున్నాడు.

ఇక ఎప్పటికో రిలీజ్ అయిపోవాల్సిన ఈ చిత్రం ఇప్పుడు అలా లేట్ అవుతూ వచ్చింది. కాగా ఈ భారీ చిత్రం నుంచి ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ ట్రైలర్ పై ఇప్పుడు మాసివ్ అప్డేట్ అయితే వచ్చేసింది. కాగా ఆల్రెడీ సినీ వర్గాల్లో డిసెంబర్ 1న అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

కానీ ఈ గ్యాప్ లోనే చిత్ర యూనిట్ కూడా సెన్సేషనల్ క్లారిటీ ని ఇచ్చేసారు. మరి దీనితో అయితే మేకర్స్ ట్రైలర్ ని  రిలీజ్ చేస్తున్నట్టుగా తెలిపారు. సో ఈ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ నుంచి అతి త్వరలోనే వచ్చేస్తుంది అని చెప్పాలి. కానీ ట్రైలర్ మాత్రం డిసెంబర్ 1 కే ఫిక్స్ అయ్యింది. మేకర్స్ కూడా దీనినే మరికొన్ని రోజుల్లో అయితే అతి త్వరలో అనౌన్స్ చేయనున్నారు అని చెప్పవచ్చు.

మరి ఇదెప్పుడు అనౌన్స్ అవుతుందో చూడాలి. ఇంకా ఈ భారీ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా శ్రేయ రెడ్డి సహా పృథ్వీ రాజ్ సుకుమారన్ మరియు జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. అలాగే కేజీఎఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ రానున్న డిసెంబర్ 22న పాన్ ఇండియా లెవెల్లో పార్ట్ 1 ని రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. 
https://x.com/SalaarTheSaga/status/1722575572013035628?s=20