బిగ్ అప్డేట్ : “సలార్” వాయిదా..రిలీజ్ కి అన్ని ప్లానులా??

ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ సహా ఇండియన్ సినిమా విస్తరించి ఉన్న ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “సలార్ ది సీజ్ ఫైర్”. కాగా పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా ఏక్షన్ డ్రామా ఇదే సెప్టెంబర్ 28 విడుదల కావాల్సి ఉంది.

అయితే చిత్రం యూనిట్ ఇప్పటికే యూఎస్ బుకింగ్స్ ని ఓపెన్ చేయగా ఊహించని రెస్పాన్స్ దీనికి వచ్చింది. కానీ సీన్ కట్ చేస్తే సినిమా వాయిదా అంటూ వచ్చిన బజ్ సినిమా ఆడియెన్స్ ని నీరు గార్చింది. కాగా ఈ సస్పెన్స్ లో ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకపోవడంతో అయితే వాయిదా అనేది అనధికారికంగా ఖరారు అయ్యింది.

ఇక ఇన్ని రోజులు విరామం అనంతరం అయితే ఇప్పుడు చిత్ర యూనిట్ చావు కబురు చల్లగా అన్నట్టు “సలార్” వాయిదా వేస్తున్నామని కన్ఫర్మ్ చేసారు. ఇక ఈ భారీ చిత్రం రిలీజ్ ఎపుడు అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదు. సూన్ అంటూ హింట్ ఇచ్చారు అంటే చాలా లేట్ గానే ఉంటుంది అని మాత్రం అందరికీ కన్ఫర్మ్ అయ్యింది.

అయితే ఇప్పుడు ఉన్న అప్డేట్ ప్రకారం ఈ చిత్రం రిలీజ్ కి నవంబర్ దీపావళి, అలాగే డిసెంబర్ ఇంకా జనవరి మార్చ్ నెలలు పరిశీలనలో ఉన్నాయట. ఎప్పటికి వర్కౌట్ అయితే సినిమా అప్పుడే వస్తుంది అని సినీ వర్గాలు నుంచి లేటెస్ట్ సమాచారం. మొత్తానికి సలార్ విషయంలో మేకర్స్ ఓ బిగ్ డిజప్పాయింట్మెంట్ ని మిగిల్చారు. 
https://x.com/SalaarTheSaga/status/1701800299349082362?s=20