ఓటిటి : “స్కంద” రిలీజ్ డేట్ పై బిగ్ రివీల్ 

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర మిడ్ రేంజ్ హీరోస్ లో అయితే అంతా కూడా ఆల్ మోస్ట్ మంచి సక్సెస్ లు అందుకున్నారు. కాగా వారిలో నాచురల్ స్టార్ నాని మొదట స్టార్ట్ చేయగా నెక్స్ట్ అయితే విజయ్ దేవరకొండ కూడా ఖుషి తో మంచి విజయాన్ని అందుకున్నాడు.

ఇక వీరి తర్వాత అంతా ఆసక్తిగా చూసిన యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని. తాను దర్శకుడు బోయపాటి శ్రీనుతో చేసిన మాస్ చిత్రమే “స్కంద”. అయితే పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసిన ఈ చిత్రం మాస్ ఆడియెన్స్ ని బాగానే పట్టుకుంది. ఉన్న కొన్ని రోజులు కూడా బాగానే ఆడిన చిత్రం కొద్దిగా నష్టాలు అందించింది.

కానీ మాస్ ఆడియెన్స్ కి మాత్రం ఈ సినిమా బాగానే ఎక్కింది. ఇక ఈ సినిమా ఓటిటి రిలీజ్ పై మాత్రం బిగ్ అప్డేట్ ఇప్పుడు బయటకి వచ్చింది. కాగా ఈ చిత్రాన్ని ప్రముఖ సంస్థ డిస్నీ హాట్ స్టార్ వారు పాన్ ఇండియా భాషల్లో హక్కులు సొంతం చేసుకోగా నిజానికి నిన్నటి నుంచి ఈ సినిమా అందులో స్ట్రీమ్ కావాల్సి ఉంది కానీ మేకర్స్ అయితే నిన్న దీని రిలీజ్ డేట్ పై అప్డేట్ అందించారు.

కాగా దీనితో ఈ సినిమా నవంబర్ 2 నుంచి అయితే హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానున్నట్టుగా కన్ఫర్మ్ చేసారు. దీనితో స్కంద ఓటిటి కోసం చూస్తున్నవారికి ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా సాయి మంజ్రేకర్ కూడా నటించింది. అలాగే రామ్ డ్యూయల్ రోల్స్ లో ఈ చిత్రానికి నటించాడు.