బిగ్ అప్డేట్ : ఓటిటిలో “సలార్” స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే 

గత ఏడాది టాలీవుడ్ సినిమా నుంచి వచ్చిన చిత్రాల్లో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. మరి అన్ని ఇండస్ట్రీస్ నుంచి కూడా పలు భారీ గ్రాసర్ లు గత ఏడాదిలో వచ్చాయి కానీ టాలీవుడ్ నుంచి వచ్చిన చిత్రాలు ఏవి లేవు.

దీనితో మన నుంచి కూడా ఓ భారీ గ్రాసర్ ని చూడాలి అనుకునేది మాత్రం సలార్ తోనే సాధ్యం అవుతుంది అని చాలా మంది అనుకున్నారు. అయితే ఇది 1000 కోట్ల సినిమాగా మారలేదు కానీ సుమారు 700 కోట్ల సినిమాగా అయితే నిలిచింది. కాగా ఈ చిత్రం ఇప్పుడు దాదాపు రన్ ని కంప్లీట్ చేసుకోగా ఓటిటి రిలీజ్ కోసం కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా నెట్ ఫ్లిక్స్ వారు ఈ చిత్రాన్ని అతి త్వరలోనే రిలీజ్ చేస్తామని ఈ మధ్యనే అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా ఎప్పుడు వస్తోంది అనేది డేట్ కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ లో ఈ జనవరి 20 నుంచే వస్తుంది అని ఇప్పుడు ఫిక్స్ అయ్యిపోయింది.

దీనితో రేపు నుంచే నెట్ ఫ్లిక్స్ లో అందులోని సౌత్ ఇండియా భాషల్లో అయితే ఈ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. కాగా ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్ జగపతిబాబు, శ్రేయ రెడ్డి, ఈశ్వరి రావు తదితర భారీ తారాగణం ఈ చిత్రంలో నటించారు. అలాగే మేకర్స్ ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు.