ప్రభాస్ “సలార్” జపాన్లో విడుదలపై బిగ్ అప్డేట్.. 

గత ఏడాది ఇండియన్ సినిమా నుంచి అలాగే టాలీవుడ్ సినిమా నుంచి కూడా వచ్చిన బిగ్గెస్ట్ చిత్రాల్లో ప్యాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా నటించిన భారీ చిత్రం “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి. కాగా ఈ చిత్రం రిలీజ్ అయ్యాక భారీ ఓపెనింగ్స్ ని ఈ చిత్రం అందుకుంది.

మరి ఈ చిత్రాన్ని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించగా మొత్తం రెండు భాగాలుగా ఈ చిత్రంని ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మాసివ్ చిత్రం రిలీజ్ ని మొదటగా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. వాటిలో ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేస్తారని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ చిత్రం ఇంగ్లీష్ లో రిలీజ్ ఆగినట్టే అనిపిస్తుంది.

కానీ ప్రభాస్ కి ఇంగ్లీష్ ఏమో కానీ జపాన్ దేశంలో అయితే భారీ క్రేజ్ ఉంది. అందుకే అక్కడ కూడా తాము సినిమా రిలీజ్ చేస్తున్నట్టుగా ఇది వరకే తెలిపాడు. కాగా ఈ చిత్రం రిలీజ్ జపాన్ దేశంలో ఎప్పుడు ఏంటి అనేది రిలీజ్ కి సిద్ధం చేసారు. దీనితో ఈ సినిమాని మేకర్స్ ఈ ఏడాది సమ్మర్ లో అయితే రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ఇక జపాన్ లో ఈ చిత్రం మూవీ ట్విన్ 2 వారు రిలీజ్ చేయనున్నట్టుగా ఇప్పుడు వార్తలు కన్ఫర్మ్ అయ్యాయి. మరి ఇపుడు వరకు ఇండియన్ సినిమా నుంచి బిగ్గెస్ట్ గ్రాసర్ గా ఆర్ ఆర్ ఆర్ సినిమా బిలియన్ వసూళ్లతో అదరగొట్టింది. మరి ఈ చిత్రాన్ని సలార్ బ్రేక్ చేస్తుందో లేదో అనేది చూడాలి. ఇక ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ సుకుమారన్, జగపతి బాబు తదితరులు నటించారు.