బిగ్ అప్డేట్ : మాస్ నుంచి కూల్ ప్రభాస్ ని చూసేందుకు సిద్ధమా?

ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో పలు వరల్డ్ క్లాస్ సహా మన తెలుగు లోకల్ లెవెల్ సినిమాలు కూడా ఉన్నాయి. మరి ఈ చిత్రాల్లో కంప్లీట్ గా ఫ్యాన్స్ కోసమే అన్నట్టుగా చేస్తున్న సినిమా ఏదైనా ఉంది అంటే ఆ సినిమా దర్శకుడు మారుతితో చేస్తున్న సినిమా అని చెప్పాలి.

కాగా ఈ చిత్రం అనౌన్స్ చేసినపుడు ఎన్నో ట్రోల్స్ వచ్చాయి కానీ దర్శకుడు వాటిని ఛాలెంజ్ గా తీసుకొని అలా ట్రోల్ చేసిన అందరి నోరు మూయించేలా ప్రభాస్ తో సినిమా చేస్తానని తెలిపాడు. కాగా ఈ గ్యాప్ లో సినిమా నుంచి వచ్చిన పలు లీక్స్ కూడా అందరిని ఆశ్చర్యపరిచాయి.

కాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పుడు ఫైనల్ గా మేకర్స్ ఓ బిగ్ అప్డేట్ ని అందించారు. ప్రభాస్ మరియు మారుతీ ప్రాజెక్ట్ తాలూకా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ బ్యూటిఫుల్ ప్రీ లుక్ పోస్టర్ ని డిజైన్ చేసి మేకర్స్ వదిలారు. మరి ఈ కొత్త అప్డేట్ తో వచ్చే ఏడాది పొంగల్ కానుకగా విడుదల చేస్తున్నట్టుగా తెలిపారు.

అంతే కాకుండా ఇప్పుడు వరకు మాస్ లుక్ లో అదరగొట్టిన ప్రభాస్ ఈ చిత్రంతో అయితే కూల్ లుక్ లో ఒక సరికొత్త అవతార్ లో ట్రీట్ ఇస్తాడు సిద్ధంగా ఉండండి అని మేకర్స్ చెప్తున్నారు. దీనితో ఈ క్రేజీ ఉపడటఅప్డేట్ ఇప్పుడు ఫ్యాన్స్ లో కొత్త ఉత్సాహాన్ని అందించారు. కాగా ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మాణం వహిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా తోనే ఆమె టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది.