బిగ్ అప్డేట్ : ప్రభాస్ సినిమాకి పోటీగా “హనుమాన్” రిలీజ్.!

ప్రస్తుతం టాలీవుడ్ నుంచి అంతా కంటెంట్ రూల్ చేస్తుంది. పెద్ద హీరో ఉండి సరైన కంటెంట్ లేకపోతే ఆ సినిమాని ఎవరూ కాపాడలేరు అని మొన్నటికి మొన్న ఆచార్య, లైగర్ రీసెంట్ గా ఏజెంట్ లాంటి భారీ చిత్రాలు చూపించాయి. అయితే కంటెంట్ సరిగ్గా ప్లాన్ చేస్తే చిన్న హీరో దర్శకుడు అయినా కూడా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా నుంచి డిమాండ్ వస్తుంది అని చూపించిన చిత్రమే “హనుమాన్”.

యంగ్ దర్శకుడు ప్రశాంత్ వర్మ అలాగే యంగ్ హీరో తేజ సజ్జ వీళ్లెవరికీ భారీ స్థాయి మార్కెట్ గాని భారీ ఓపెనింగ్స్ కానీ లేవు కానీ ఇపుడు వీరు చేస్తున్న టాలీవుడ్ ఫస్ట్ సూపర్ హీరో చిత్రం “హను – మాన్” పై ఉన్న హైప్ ఆకాశంలోకి ఉంది. గత ఏడాది అయితే భారీ బడ్జెట్ చిత్రం ఆదిపురుష్ ని మించి ఈ చిన్న సినిమాకి హైప్ వచ్చింది అంటే ఈ సినిమా టీజర్ నమోదు చేసిన ఇంపాక్ట్ ఆ లెవెల్లో ఉంది.

కాగా టీజర్ దెబ్బతో పాన్ ఇండియా భాషల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా రష్యన్, జర్మనీ, కొరియా తదితర భాషలనుంచి కూడా షాకింగ్ డిమాండ్ ఈ చిత్రానికి ఏర్పడింది. దీనితో ఈ చిత్రం రిలీజ్ కోసం ఆడియెన్స్ వెయిట్ చేస్తుండగా ఇపుడు ఆ బిగ్ అప్డేట్ ని మేకర్స్ ఇచ్చారు. అయితే ఈ చిత్రంని ఏకంగా వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేసేసారు.

ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న అయితే వరల్డ్ వైడ్ 11 భాషల్లో మాసివ్ రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. అయితే ఇదే రోజున ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ చిత్రం “ప్రాజెక్ట్ కే” కూడా ఉంది. మరి అదే రోజుకి ఈ సినిమాని ఫిక్స్ చేయడం డేరింగ్ స్టెప్ అని చెప్పాలి. మరి ప్రభాస్ సినిమా అప్పుడు రావట్లేదని కన్ఫర్మ్ చేసుకున్నాకే చేసారో ఏమో తెలియాల్సి ఉంది.