“ఆదిపురుష్” ఓటిటి డేట్ పై బిగ్ క్లారిటీ.!

ఇపుడు ఇండియా సినిమా అంతా ఎదురు చూస్తున్న ఏకైక సినిమా “ఆదిపురుష్”. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ లో బాహుబలి తర్వాత మరో లార్జర్ దన్ లైఫ్ చిత్రంగా అయితే ఇది నిలవగా ఇపుడు ఈ భారీ సినిమా కోసం అయితే ఇప్పుడు ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

కాగా ఈ మాసివ్ విజువల్ ట్రీట్ ని అయితే దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించగా ఇక ఇండియా వైడ్ కూడా బుకింగ్స్ ఇపుడు ఓపెన్ అవుతున్నాయి. అయితే ఈ తరహా భారీ సినిమాలు ఎప్పుడు ఓటిటి లోకి వస్తాయి అనేది కూడా బిగ్ మేటర్ అని చెప్పాలి. కాగా ఇప్పుడు ఆదిపురుష్ ఓటిటి డేట్ కి సంబంధించి ఇపుడు బిగ్ అప్డేట్ తెలుస్తుంది.

కాగా ఈ చిత్రం జూన్ 16న రిలీజ్ అవుతుండగా అక్కడ నుంచి మళ్ళీ 8 వారాల తర్వాత మాత్రమే ఓటిటి లోకి వస్తుంది అని ఇపుడు సినీ వర్గాలు కన్ఫర్మ్ చేసాయి. అయితే 8 వారాల తర్వాతే ఓటిటి రిలీజ్ ఉంటుంది తప్ప ముందు అయితే రాదని దీని అర్ధం కాగా డేట్ అయితే ఈ 8 వారాల తర్వాత మాత్రమే రానుంది.

సో ఆదిపురుష్ ని మాత్రం అప్పటివరకు థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చెయ్యాలి. ఇక ఈ చిత్రంలో కృతి సనన్, సైఫ్ అలీఖాన్, సన్నీ సింగ్ సహా సోనాల్ చౌహన్ తదితరులు కీలక పాత్రల్లో నటించగా అజయ్ మరియు అతుల్ లు సంగీతం అందించారు. అలాగే టి సిరీస్ భూషణ్ కుమార్, ఓంరౌత్ లు అయితే ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మాణం వహించారు.