బిగ్ అప్డేట్ : “ఇస్మార్ట్ శంకర్ 2” లో కేజీఎఫ్ విలన్.!

గత ఏడాది భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యి భారీ డిజాస్టర్ అయ్యిన చిత్రాల్లో దర్శకుడు పూరి జగన్నాథ్ నుంచి వచ్చిన “లైగర్” చిత్రం కూడా ఒకటి. అయితే అప్పటివరకు డిజాస్టర్స్ లోనే ఉన్నా పూరి లైగర్ కి ఆ రేంజ్ హైప్ రావడానికి కారణం దానికి ముందు తాను చేసిన “ఇస్మార్ట్ శంకర్” సినిమానే అని చెప్పాలి.

మరి ఉస్తాద్ రామ్ పోతినేనితో చేసిన ఈ సినిమా రామ్ కి పూరి కి ఇద్దరికి భారీ కం బ్యాక్ గా నిలిచి ఇద్దరి గ్రాఫ్ ని పెంచింది. అయితే ఇక లైగర్ డిజాస్టర్ తో మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవుతూ అనౌన్స్ చేసిన చిత్రమే ఇస్మార్ట్ శంకర్ 2 దీనిని ఈసారి “డబుల్ ఇస్మార్ట్” గా అనౌన్స్ చేయగా..

ఈ భారీ చిత్రంలో లేటెస్ట్ గా బాలీవుడ్ స్టార్ నటుడు కేజీఎఫ్ విలన్ సంజయ్ దత్ నటిస్తున్నట్టుగా సంజయ్ బర్త్ డే కానుకగా మేకర్స్ ఇప్పుడు బిగ్ అప్డేట్ ని అందించారు. కాగా ఈ చిత్రంలో సంజయ్ దత్ బిగ్ బుల్ గా కనిపిస్తాడని మాసివ్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా మేకర్స్ రిలీజ్ చేశారు.

దీనితో ఈ భారీ సీక్వెల్ లో సంజయ్ దత్ విలన్ గా కనిపించన్నాడు అని చెప్పాలి. కాగా ఈ చిత్రంలో కొత్త హీరోయిన్స్ ఉంటారని కూడా టాక్ రాగ మొదటి పార్ట్ కన్నా చాల భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండగా ఈ చిత్రాన్ని ఛార్మి, పూరి జగన్నాథ్ నిర్మాణం వహిస్తుంది. అలాగే వచ్చే ఏడాది మహా శివరాత్రి కానుకగా మార్చ్ 8న అయితే మేకర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ కి తీసుకొచ్చే సన్నాహాలు చేస్తున్నారు.