బిగ్ అప్డేట్ : “బాలయ్య 108” అదిరే టైటిల్ వచ్చేసింది.!

టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా ఇపుడు నటిస్తున్న తన కెరీర్ 108వ సినిమా కోసం అందరికీ తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండగా ఈ చిత్రం నుంచి అయితే మేకర్స్ నిన్ననే క్రేజీ అప్డేట్ అందించారు.

మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా 108 హోర్డింగ్స్ తో అయితే ఈ సినిమా టైటిల్ ని రివీల్ చేస్తున్నట్టు చెప్పగా ఈ టైటిల్ అయితే ఇపుడు ఫైనల్ గా రిలీజ్ అయ్యిపోయింది. అయితే మొదట “బ్రో ఐ డోంట్ కేర్” తర్వాత “భగవంత్ కేసరి” అనే టైటిల్ లు రూమర్స్ గా రాగ వీటిలో రెండో టైటిల్ “భగవంత్ కేసరి” గా చిత్రాన్ని ఇప్పుడు అనౌన్స్ చేశారు.

ఇక దీనిపై అనౌన్స్ చేసిన పోస్టర్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పాలి. కత్తి పట్టుకొని యుద్ధహ్ భూమిలోకి దిగిన బాలయ్యగా మొత్తానికి అయితే అనుకున్న టైటిల్ నే ఇపుడు వచ్చింది అని చెప్పొచ్చు. కాగా ఈ సినిమాలో అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఓ ప్రధాన పాత్రలో నటిస్తుంది.

అలాగే థమన్ ఎస్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంతో బాలయ్యకి తాను హ్యాట్రిక్ వర్క్ అందిస్తున్నాడు. అలాగే షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా నుంచి అసలు బ్లాస్ట్ అయితే ఈ జూన్ 10న బాలయ్య బర్త్ డే కానుకగా ఉంటుంది అని మేకర్స్ అనౌన్స్ చేసారు. ఈ టైటిల్ కోసం బాలయ్య ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఎగ్జైటెడ్ గా ఇప్పుడు ఉన్నారు.