మళ్ళీ చాన్నాళ్ల తర్వాత ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ విషయంలో ఆ హీరో ఫ్యాన్స్ సహా ఇతర ఆడియెన్స్ కూడా ఓ రేంజ్ లో ఎగ్జైట్ అవుతున్న మాసివ్ ప్రాజెక్ట్ నే “సలార్”. పవర్ ఫుల్ కాంబినేషన్ ప్రభాస్ మరియు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో అనౌన్స్ చేసిన ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ప్రకటించినప్పుడే ఇండియన్ సినిమా దగ్గర ఓ బిగ్గెస్ట్ కాంబినేషన్ గా నిలిచింది.
మరి అప్పుడు నుంచే ఈజీగా 1000 కోట్ల సినిమాగా ఇది నిలుస్తుంది అని గట్టి నమ్మకం ఏర్పడగా ఇప్పుడు సమయం దగ్గరకి వస్తుండడంతో హైప్ వేరే లెవెల్ కి వెళ్ళిపోతుంది. ఇక గత కొన్ని రోజులు కితం వచ్చిన సినిమా మొదటి ట్రైలర్ కి కాస్త మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది.
దీనితో రెండో ట్రైలర్ కూడా వస్తుంది అని కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఇపుడు ఈ ట్రైలర్ పై అయ్యితే ప్రభాస్ ఫ్యాన్స్ లో కొన్ని అనధికారిక వార్తలు ఇప్పుడు వైరల్ గా మారాయి. సినీ వర్గాలు వారు ఈ రెండో ట్రైలర్ ని ఇపుడు కన్ఫర్మ్ చేయగా దీనిని రేపే డిసెంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టుగా ఇపుడు క్లారిటీ వచ్చేసింది.
కాగా ఈ రెండో ట్రైలర్ మాత్రం ఓ ఫుల్ ఏక్షన్ ప్యాకెడ్ గా ఉంటుంది అని కన్ఫర్మ్ చేసేసారు. దీనితో రేపు మాత్రం మాములుగా ఉండదని చెప్పొచ్చు. అయితే దీనికి ఇంకా సమయం ఖరారు కావాల్సి ఉంది. ఈ ట్రైలర్ కోసం మాత్రం ఫ్యాన్స్ చాలా అసలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు. ఇక ఇందులో నీల్ ఎలాంటి విధ్వంసాన్ని చూపిస్తాడో చూడాలి మరి.