బిగ్ న్యూస్ : ఫైనల్ గా ఆస్కార్స్ లో సూర్య.. ఈసారి మిస్సవ్వలేదు.!

suriya-to-do-periodical-drama

లేటెస్ట్ భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో స్టార్ హీరో సూర్య విలన్ గా ఉలగనయగన్ కమల్ హాసన్ హీరోగా దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “విక్రమ్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో లాస్ట్ 10 నిమిషాల్లో వచ్చిన సూర్య అందరి మైండ్ ని బ్లాక్ చేసాడు. ఇక దీనితో అయితే లాస్ట్ ప్లాప్ “ఈటి” తో డీలా పడ్డ అభిమానులు కాస్త తేరుకున్నారు. 

కానీ ఇప్పుడు మాత్రం మళ్ళీ కాలర్ ఎగరేసే పని చేసాడు సూర్య. ఇంకా ఈ డీటెయిల్స్ లోకి వెళితే ఈటి కన్నా ముందు సూర్య నటించిన రెండు ఎమోషనల్ హిట్ చిత్రాలు ఆకాశం నీ హద్దురా మరియు జై భీం చిత్రాలు ఓటిటి లో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ హిట్ అయ్యాయి. 

మరి ఈ సినిమాల కంటెంట్ తో అయితే ఆస్కార్ వరకు కూడా ఈ చిత్రాలు వెళ్లగా అక్కడ నుంచి చివరి నిమిషంలో ఈ చిత్రాలు వెనక్కి వచ్చేసాయి. దీనితో ఇండియన్ సినిమా లవర్స్ కాస్త నిరాశ పడగా ఈసారి మాత్రం సూర్య దెబ్బ మిస్సవ్వలేదు. ఈసారి తన సినిమాలు ఆస్కార్ ఈవెంట్ లో ఉండకపోయినా ఏకంగా తాను ఒక గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. 

అవును ఇది నిజం ఈసారో ఆస్కార్ 2022 అకాడమీ అవార్డు ఫంక్షన్ కి గాను ప్రపంచ వ్యాప్తంగా 397 మందికి ఆహ్వానంగా రాగా అందులో హీరో సూర్య కూడా ఒకడిగా నిలిచాడు. దీనితో ఫైనల్ గా మాత్రం సూర్య ఫ్యాన్స్ ని ఆస్కార్ విషయంలో తల దించుకోనివ్వలేదు.