బిగ్ గాసిప్ : బాలయ్య షోలో పవన్..త్రివిక్రమ్ కాకుండా మరో గెస్ట్ కూడా అట.!

ఇప్పుడు నందమూరి నటసింహ నందమూరి బాలకృష్ణ అయితే ఓ పక్క తన సినిమాలు అలాగే మరో పక్క రాజకీయాలు ఇంకా తన ఓటిటి షో అన్ స్టాప్పబుల్ ని కూడా సక్సెస్ ఫుల్ గా చేస్తున్నారు. అయితే దీనితో ఇప్పుడు స్టార్ట్ చేసిన రెండో సీజన్లో మొదటి సీజన్లో మించి బిగ్ స్టార్స్ హాజరు అవుతూ కనిపించడం అనేది మరింత ఆసక్తిగా మారింది.

ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ తో అభిమానులు కేజ్రీగా ఆనందం వ్యక్తం చేస్తుండగా నెక్స్ట్ అయితే మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కూడా పిలుస్తున్నారని టాక్ ఉంది. అయితే గతంలో ఓ ఎపిసోడ్ కి గాను బాలయ్య మాట్లాడుతూ త్రివిక్రమ్ ఫోన్ లో అయితే పవన్ తో రావాలని కోరగా అక్కడ నుంచే పవన్ రావడం కన్ఫర్మ్ అని అంతా అనుకున్నారు.

కానీ లేటెస్ట్ గా అయితే బిగ్ గాసిప్ ఈ షో పై బయటకి వచ్చింది. మరి పవన్ అయితే బాలయ్య తో ఎపిసోడ్ కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా తనతో పాటుగా మరో గెస్ట్ కూడా రాబోతున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది. మరి ఇది అయితే త్రివిక్రమ్ మాత్రం కాదట. మరి అతడు ఎవరంటే ఇప్పుడు పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు దర్శకుడు క్రిష్ జాగర్లమూడి అని తెలుస్తుంది. దీనితో అయితే ఈ క్రేజీ టాక్ ఇప్పుడు సోషల్ మీడియా సహా సినీ వర్గాల్లో కాక రేపుతోంది.