బిగ్ బ్రేకింగ్ : శ్రీదేవి బయోపిక్ లో రష్మిక మందన్న.. ఇండస్ట్రీ మొత్తం షాక్.

రష్మిక మందన్న సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలలో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకొని స్టార్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరిపోయింది. ప్రస్తుతం రష్మిక మందన్న టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా వెలుగుతోంది. ప్రస్తుతం రష్మిక మందన్న.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప అన్న పాన్ ఇండియన్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, ముత్యం శెట్టి మీడియా సంయుక్తంగా బారి బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ నటిస్తున్న ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో సుకుమార్ ఎక్కడా కామ్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నాడు.

 

కాగా ఈ సినిమా అల్లు అర్జున్ – రష్మిక మందన్న లకి బాలీవుడ్ లో డెబ్యూ సినిమా కావడం విశేషం. ఇక రీసెంట్ గా రష్మిక కి బాలీవుడ్ లో రెండు సినిమాలు చేసే అవకాశం దక్కింది. సిద్దార్థ్ మల్‌హోత్రా తో ఇప్పటికే మిషన్ మజ్ఞు అన్న సినిమా చేస్తోంది. ఈ సినిమా కాకుండా బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో వికాస్ భల్ దర్శకత్వంలో ఒక సినిమా కమిటయిందట. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కి రష్మిక కూతురు గా నటిస్తోంది. ఇప్పటికే అమితాబ్ తో నటించిన దీపిక పదుకొణె, తాప్సీ బాలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు అందుకుంటున్నారు.

 

ఈ క్రమంలో ఇప్పుడు రష్మిక కూడా అమితాబ్ బచ్చన్ తో నటించే ఛాన్స్ దక్కించుకొని క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. అయితే రష్మిక మందన్న బయోపిక్స్ లో నటిస్తే .. ఎవరి బయోపిక్స్ లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రశ్న నెటిజన్స్ నుంచి ఎదురైందట. ఈ రష్మిక ఊహించని సమాధానం ఇచ్చి హాట్ టాపిక్ అయింది. రష్మిక మందన్న కి అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ లో అవకాశం వస్తే నటించాలని ఉందని తెలిపింది. అలాగే సౌందర్య బయోపిక్ లో అవకాశం వచ్చినా వదులుకోనని అంటోంది. మరి రష్మిక ఇచ్చిన ఆఫర్ కోసం మేకర్స్ ఈ బయోపిక్స్ కి ప్లాన్ చేస్తారేమో చూడాలి.