యువకుడు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన నటి భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ఒక్కడు, ఖుషి వంటి సినిమాల ద్వారా విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇలా హీరోయిన్ గా పలు చిత్రాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న భూమిక తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ఇలా పాగల్, ఎంసీఏ, సవ్యసాచి వంటి చిత్రాలలో అక్క, వదిన క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను మరోసారి సందడి చేస్తోంది.
తనకు అవకాశాలు చాలా వచ్చాయని అయితే ఆ కథలో ప్రియారిటి ఆ పాత్ర కేవలం నేను మాత్రమే చేయగలనన్న నమ్మకంతో దర్శక నిర్మాతలు తన వద్దకు వచ్చి వాళ్లే తనకు ఆఫర్స్ ఇచ్చారని ఈ సందర్భంగా భూమిక తెలియజేశారు. తనకు కమిట్మెంట్ తో ఆఫర్ రాలేదని దర్శకనిర్మాతలు ముంబై వచ్చి తనకి ఆఫర్స్ ఇచ్చారని ఈ సందర్భంగా భూమిక క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు.