ఓటిటి : “భోళా శంకర్” రిలీజ్ డేట్ వచ్చేసింది.. 

ఈ ఏడాది టాలీవుడ్ సినిమా దగ్గర మొట్ట మొదటి బిగ్గెస్ట్ హిట్ సినిమాని అయితే మెగాస్టార్ చిరంజీవినే అందించిన సంగతి తెలిసిందే. దర్శకుడు బాబీతో చేసిన సినిమా వాల్తేరు వీరయ్య సెన్సేషనల్ హిట్ కాగా ఈ హిట్ అనంతరం వచ్చిన రిలీజ్ “భోళా శంకర్” తో చిరు ఓ మెగా డిజాస్టర్ ని అయితే అందించారు.

కాగా దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించిన ఈ సినిమా ఓ తమిళ చిత్రానికి రీమేక్ కాగా మొదటి నుంచీ అంచనాలు తక్కువే ఉన్నాయి. అలానే రిలీజ్ అయ్యిన ఈ చిత్రం సీన్ కట్ చేస్తే టాలీవుడ్ లో మిడ్ రేంజ్ హీరోస్ తరహాలో ఓపెనింగ్స్ అందుకొని ఇక రెండో రోజు నుంచి అయితే ఖాళీ అయిపోయింది.

దీనితో భారీ నష్టాలు మిగిల్చిన సినిమాల్లో ఇది ఒకటి టాలీవుడ్ నుంచి నిలవగా ఇప్పుడు ఫైనల్ గా ఓటిటి వెర్షన్ రిలీజ్ కి అయితే సిద్ధం అయ్యింది. కాగా ఈ సినిమాని ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ వారు కొనుగోలు చేయగా ఇందులో ఈ చిత్రం ఈ సెప్టెంబర్ 15 న రిలీజ్ కానున్నట్టుగా ఇపుడు తెలిపారు.

అలాగే పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా అందులో ఉండనున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటించగా కీర్తి సురేష్ చిరుకి చెల్లెలు రోల్ లో నటించింది. అలాగే యంగ్ నటుడు సుశాంత్ కూడా సినిమాలో నటించాడు. ఇంకా ఈ సినిమా ని మహతి స్వర సాగర్ సంగీతం అందించగా సినిమా ప్లాప్ లో ఈ పాటలు కూడా ఒక భాగం అని చెప్పొచ్చు. మరి ఓటిటి లో ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.