ఓటిటి : బాలయ్య “భగవంత్ కేసరి” డీల్ లాక్ చేసేశారా?

టాలీవుడ్ గ్లోబల్ లయన్ నందమూరి నటసింహ బాలకృష్ణ ఇప్పుడు వరుస హిట్స్ తో మళ్ళీ తన హిట్ ట్రాక్ లోకి రాగ తన నెక్స్ట్ సినిమాలు అయితే మరింత గ్రాండ్ లెవెల్లో ఉంది అదిరే లైనప్ తో రాబోతున్నారు. కాగా ఈ చిత్రాల్లో ఇపుడు ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న చిత్రం “భగవంత్ కేసరి” పై భారీ అంచనాలు ఉండగా.

ఈ చిత్రం నుంచి రీసెంట్ గా వచ్చిన టీజర్ కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ అందుకోవడంతో మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఇక ఈ మాస్ చిత్రం టీజర్ దెబ్బకి క్రేజీ హైప్ తెచ్చుకోగా ఇప్పుడు ఈ చిత్రం ఓటిటి డీల్ ని పూర్తి చేసేసుకున్నట్టుగా సినీ వర్గాల నుంచి రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఇపుడు ఈ చిత్రం డిజిటల్ రైట్స్ ని అయితే దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేసినట్టుగా సినీ వర్గాలు వారు చెప్తున్నారు. దీనితో భగవంత్ కేసరి హక్కులు వీరికి సొంతం అయ్యాయని చెప్పొచ్చు. పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ కొన్ని వారాల్లో అయితే ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.

కాగా ఈ చిత్రంలో అయితే కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా యంగ్ హీరోయిన్ శ్రీ లీల అయితే కీలక పాత్రలో నటిస్తుంది. అలాగే షైన్ స్క్రీన్ వారు నిర్మాణం వహిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే ఈ సినిమాతో హ్యాట్రిక్ గా బాలయ్య సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నాడు.