రానున్న అక్టోబర్ నెలలో అయితే సౌత్ ఇండియా సినిమా నుంచి పలు భారీ చిత్రాలు రేస్ లో ఉన్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాల్లో భారీ హైప్ తో ఉన్న చిత్రం “భగవంత్ కేసరి” కూడా ఒకటి. టాలీవుడ్ మాస్ గాడ్ నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనీల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న ఈ మాస్ డ్రామాపై ఎనలేని హైప్ ఉంది.
మెయిన్ గా బాలయ్య రెండు భారీ హిట్స్ అనంతరం చేస్తున్న సినిమా ఇది కావడంతో ఈ క్రేజ్ నెలకొనగా ఈ సినిమా నుంచి ఆసక్తిగా ఎదురు చూస్తున్న మొదటి సాంగ్ అయితే ఇప్పుడు రిలీజ్ కి వచ్చేసింది. మరి గణేష్ ఆంథెమ్ అంటూ సంగీత దర్శకుడు థమన్ సమకూర్చిన ఈ ఫుల్ సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పొచ్చు.
థమన్ కొత్తగా ట్రై చేసిన ఈ పవర్ ఫుల్ బీట్ కి ఇంట్రెస్టింగ్ గా బాలయ్య మరియు శ్రీలీల ల ఎనర్జీ చూస్తే వావ్ అనిపించక మానదు. దీనితో ఈ సాంగ్ తో ఈ సెప్టెంబర్ లో వచ్చే వినాయక చవితి పండుగ కాస్త ముందే వచ్చేసింది అని చెప్పాలి. ఇక నుంచి గణేష్ ఉత్సవాల్లో ఈ పాట మారుమోగేలా ఉందని కూడా చెప్పొచ్చు.
అయ్యితే ఈ సాంగ్ తో బాలయ్య శ్రీలీల లు తండ్రి కూతుర్లు గానే కనిపిస్తారు అనేది కూడా కన్ఫర్మ్ అయ్యింది. ఇక బాలయ్య సరసన కాజల్ నటిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు అలాగే ఈ అక్టోబర్ 19న సినిమా రిలీజ్ కాబోతుంది.
జై బోలో గణేష్ మహారాజ్ కి🙏
బిడ్డా!! చిచ్చా వచ్చిండు …
మనకి పండగ ముందే తెచ్చిండు🥁🔥#GaneshAnthem Full Lyrical from #BhagavanthKesari out now❤️🔥In Cinemas OCT 19th💥#NandamuriBalakrishna @sreeleela14 @AnilRavipudi @MusicThaman @MsKajalAggarwal… pic.twitter.com/tIlsL71hGu
— Shine Screens (@Shine_Screens) September 1, 2023