కాజల్ అగర్వాల్ బెల్లకొండ శ్రీనివాస్ మధ్య ఉన్న బంధం గురించి అందరికీ తెలిసిందే. వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తూ అందరి నోట్లో నానారు. పైగా స్క్రీన్‌పై ఎంత జాలీగా ఉంటారో తెర వెనుకా అంతే సరదాగా ఉంటారు. ఇద్దరూ కలిసి టిక్ టాక్‌లు కూడా చేసే వారు. సెట్స్‌లో ఖాళీ టైం దొరికితే చాలు ఫన్నీ వీడియోలతో రచ్చ చేస్తుంటారు. వీరిద్దరు కవచం, సీత సినిమాల్లో నటించారు. సినిమా వర్కవుట్ కాకపోయినా వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మాత్రం కుదిరింది.
ఆ మధ్య లాక్ డౌన్‌లో వీరిద్దరి సంభాషణ వైరల్ అయింది. నిన్ను చూడాలని ఉంది మిస్ అవుతున్నా అంటూ కాజల్ ఓ పోస్ట్ చేసింది. ఇలా రాలేని సమయంలో ఇలాంటి మాటలు మాట్లాడకు.. మిస్ యూ టూ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ రిప్లై ఇవ్వడంతో అప్పట్లో వీరి వ్యవహారం మరింతగా వైరల్ అయింది. ఇక బెల్లంకొండ శ్రీనివాస్ సోదరుడు గణేష్ చేసిన వంటలకు కాజల్ కితాబివ్వడం కూడా చర్చకు వచ్చింది.
ఇక కాజల్ పెళ్లి వార్తపై బెల్లంకొండ కూడా వెరైటీగా స్పందించాడు. ఈ విషయం ఎప్పటి నుంచో తెలుసున్నట్టు.. జీకే (గౌతమ్ కిచ్లూ) బ్రో అంటూ ఎంతో సన్నిహితుడైనట్టు సంబోధించాడు. అయితే తాజాగా బెల్లంకొండ అబ్బాయి మాత్రం గడ్డం పెంచి దేవదాసులా మారిపోయాడు. ఇక ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు మాత్రం లవ్ ఫెయిల్యూరా? కాజల్‌కు పెళ్లి అయిపోతోందని ఇలా అయ్యావా? కాజల్ మోసం చేసింది బ్రో, ఏం బాధపడకు అంటూ సెటైర్లు వేస్తున్నారు.