బెల్లంకొండ “ఛత్రపతి” ఆగిపోలేదండోయ్.!

టాలీవుడ్ సినిమా నుంచి కొందరు హీరోలు అయితే బాలీవుడ్ సినిమాకి కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు వారిలో యూట్యూబ్ లో తమ సినిమాల కి భారీ రెస్పాన్స్ చూసి వెళ్ళాలి అని ప్రయత్నం చేస్తున్న వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆల్రెడీ సక్సెస్ అయ్యాడు అలాగే తర్వాత రామ్, నితిన్ లాంటి వారు ఇంకా ప్రయత్నాల్లోనే ఉన్నారు.

అయితే వీరితో పాటుగా ఏకంగా డైరెక్ట్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు బెల్లంకొండ శ్రీనివాస్ హిందీలోనే సినిమా చేసేసాడు. పైగా ఇది మన తెలుగు సినిమా “ఛత్రపతి” ని రీమేక్ చేయడం గమనార్హం. కాగా ఈ చిత్రాన్ని దర్శకుడు వి వి వినాయక్ అయితే దర్శకత్వం వహిస్తుండగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా అనౌన్స్ చేశారు.

కానీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైంది కానీ తర్వాత అసలు ప్రోగ్రెస్ ఏంటి అనేది ఎవరికీ తెలియదు. ఓ టైం లో అయితే భారీ సెట్టింగ్స్ పాడైపోయాయి అని సినిమా ఆగిపోయినట్టే అని రూమర్స్ వచ్చాయి. కానీ ఈ చిత్రం పై లేటెస్ట్ అప్డేట్ తెలుస్తుంది. ఈ సినిమా షూటింగ్ అయితే అంతా అయిపోయిందట.

పైగా సినిమా రిలీజ్ కి కూడా సిద్ధం చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమాని అయితే చిత్ర యూనిట్ ఈ మే నెలలో రిలీజ్ చేయాలని చూస్తున్నారట. దీనితో అసలు ఊసే లేని ఈ సినిమా ఇంకా బతికే ఉందని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ ని హిందీలో ఏ లెవెల్లో ప్లాన్ చేస్తారో అసలు బెల్లంకొండ తాను అనుకున్న సక్సెస్ హిందీ జనంలో అందుకుంటారో లేదో చూడాలి.