సమంత వల్లే పుష్ప సినిమా హిట్‌ అయ్యింది: భానుచందర్

టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా మారాడు. అదేవిధంగా హీరోయిన్ రష్మిక మందన కూడా పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ని సంపాదించుకుంది. పాన్ ఇండియా సినిమా
గా విడుదలైన ఈ సినిమా అన్ని భాషల్లోనూ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

అయితే పుష్ప సినిమా ఈ విధంగా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి కారణం హీరోయిన్ సమంతనే అని అంటున్నారు ప్రముఖ నటుడు సీనియర్ హీరో అయిన భానుచందర్. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న హీరో భానుచందర్ పుష్పా సినిమా గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ ని టాలీవుడ్ ఓవర్ చేస్తుంది అని అందరూ అంటున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటి? అని సదరు యాంకర్ ప్రశ్నించగా.. ఆ విషయంపై స్పందించిన భానుచందర్ అవును అంటూ సమాధానమిస్తూ ఈ మధ్యకాలంలో వచ్చిన టాలీవుడ్ సినిమాలు సౌత్ లో ఏ రేంజ్ లో హిట్ ను సాధించాయి మనందరికీ తెలిసిందే.

అందుకు ఉదాహరణగా ఇటీవల రిలీజ్ అయిన పుష్ప సినిమాను చెప్పుకోవచ్చు. పుష్ప సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో చూసాం కదా అని చెప్పుకొచ్చారు భానుచందర్. అంతేకాకుండా ఈ సినిమా సమంత చేసిన స్పెషల్ సాంగ్ వల్లే ఈ సినిమా హిట్ అయింది అని తెలిపారు. ఈ పాట దేశవ్యాప్తంగా మారుమోగింది అని తెలిపారు భానుచందర్. ఇంటర్వ్యూ లో భాగంగా భానుచందర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే భానుచందర్ చెప్పిన విధంగానే పుష్ప సినిమాలో సమంత చేసిన ఆ ఐటమ్ సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. కొద్దిరోజుల పాటు ఎక్కడ చూసినా కూడా ఈ పాట మారుమోగిపోయింది.