Prabhas : కేజీఎఫ్ 2 వల్ల సలార్ పై అంచనాలు పెరిగాయి….. మరో వంద కోట్లా బిజినెస్ ఖాయం అంటున్న విశ్లేషకులు…..!

Prabhas : సాహో, రాధే శ్యామ్ మిగిల్చిన చేదు అనుభవంతో ప్రభాస్ అభిమానులు డీలా పడ్డారు. ఇక సలార్, ఆది పురుష్ గురించి కొత్తగా పెద్ద అప్ డేట్స్ కానీ లుక్స్ కానీ బయటికి రాకపోవడంతో అభిమానుల్లో నిరాశ మొదలయింది. ఇక సలార్ నుండి విడుదలైన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉండడంతో అభిమానులు సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అయితే సినిమా షూటింగ్ కి బాగా బ్రేకులు పడుతూనే ఉన్నాయి. ఇక కేజీఎఫ్ చాప్టర్ 2 విడుదల అవడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆశలు మళ్ళీ చిగురించాయి.

కేజీఎఫ్ 2 లో హీరో యష్ ఎలివేషన్ మాములుగా లేదట కొన్ని యాక్షన్ సన్నివేశాలలో దర్శకులు ప్రశాంత్ నీల్ గూస్ బంప్స్ తెప్పించారట. మెల్లగా సినిమా రివ్యూ ల్లో ఈ విషయాలు బయటికి రావడంతో ప్రభాస్ అభిమానుల్లో ఆశలు పెరుగుతున్నాయి యష్ ఎవరో కేజీఎఫ్ కి ముందు తెలుగు ప్రేక్షకులకు తెలియదు. అలాంటి యష్ నే యాక్షన్ హీరోగా అంతలా ప్రమోట్ చేసిన ప్రశాంత్ నీల్ ఇక ప్రభాస్ ను ఇంకెంత హై వోల్టెజ్ యాక్షన్ మోడ్ లో చూపిస్తాడో అనే ఊహాగానాలు మొదలయ్యాయి.

ఇక ప్రశాంత్ నీల్ ఆల్రెడీ సలార్ లో ప్రభాస్ చాలా క్రూరంగా తన శత్రువుల పట్ల వ్యవహరిస్తాడని చెప్పేసారు. దీంతో ఇక యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్ లో ఉండబోతాయో అన్న అంచనాలు పెరిగాయి ఇక ఇపుడు కేజీఎఫ్ చాప్టర్ 2 వల్ల ఇక ఈ అంచనాలు మరింత ఊపందుకున్నాయి.ఇక సలార్ ముందస్తు వ్యాపారం కూడా మరో 100కోట్లు అదనంగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ఇక ఇది ఉగ్రం సినిమా రీమేక్ అన్న వార్తలను ప్రశాంత్ కొట్టిపడేసారు.