“హనుమాన్” చలవ.. “గుంటూరు కారం” కి హౌస్ ఫుల్స్?

టాలీవుడ్ సినిమా దగ్గర ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి వచ్చిన చిత్రాల్లో భారీ అంచనాలు పెట్టుకొని వచ్చిన సినిమా ఒకటి గుంటూరు కారం అయితే ఆ సినిమాతో క్లాష్ మూలాన బాగా పబ్లిసిటీ తెచ్చుకున్న సినిమా “హనుమాన్” ఒకటి. కాగా ఈ రెండు సినిమాల్లో ప్రస్తుతానికి క్లియర్ విన్నర్ గా హనుమాన్ ఒకటే కనిపిస్తుంది.

ఈ సినిమా కొన్నందుకు అనకాపల్లి నుంచి అమెరికా వరకు కూడా ఎవరు నష్టాల్లోకి వెళ్ళబోయేది లేకుండా భారీ లాభాలు గడిస్తున్నారు. అయితే మరో పక్క గుంటూరు కారం వసూళ్లు ఏమి తక్కువేమి రాలేదు. దానికి భారీ ఓపెనింగ్స్ దక్కాయి. అలాగే ఇప్పుడు కూడా హౌస్ ఫుల్స్ పడుతున్నాయి.

ఇదెలా అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ చూస్తే ఒక్క హనుమాన్ మాత్రమే భారీ ఎత్తున హౌస్ ఫుల్స్ పెడుతుంది. దీనితో ఆ సినిమాకి జరుగుతున్నా ఓవర్ ఫ్లోస్ మూలాన ఆడియెన్స్ లో రెండో బెస్ట్ సినిమాగా గుంటూరు కారం కనిపిస్తుంది. అందుకే దానికి దొరక్కపోతే గుంటూరు కారం కి వెళ్లిపోతున్నారు.

దీనితో అలా హనుమాన్ చలవతో గుంటూరు కారం కి హౌస్ ఫుల్స్ పడుతున్నాయి అని సినీ వర్గాల్లో ఉన్న టాక్. హనుమాన్ కి కూడా ఫ్యామిలీస్ వెళ్తున్నారు. మహేష్ కి కూడా ఫామిలీ ఆడియెన్స్ లో మంచి క్రేజ్ ఉంది. అందుకే వారు గుంటూరు కారం ని తర్వాత సెలెక్ట్ చేసుకోవడంతో కొన్ని చోట్ల మెయిన్ గా ఏపీలో ఫుల్స్ పడుతున్నాయి.