Bandla Ganesh: టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి పై తన ట్విట్టర్ వేదికగా ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇటీవలే సాయి రెడ్డి కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దాంతో బండ్ల ఆయనపై బాగా ఫైర్ అయ్యాడు. ఆంధ్ర కి పట్టిన అష్టదరిద్రమా.. నీ కులపిచ్చికి, డబ్బు పిచ్చికి.. కమ్మ కులాన్నీ బలి చేయాలని చూస్తే చరిత్ర నీకు తిరిగి చర్లపల్లి చూపిస్తుంది.
నువ్వు పెద్ద దరిద్రంవి.. మా కులాన్ని ఎందుకు లాగుతున్నావు.. చంద్రబాబుతో ఉంటే ఆయనతో తేల్చుకో.. అంతేకానీ కులం మీద ఎందుకు చూపిస్తున్నావంటూ.. మరిన్ని వ్యాఖ్యలతో ఆయన ను కడిగి పారేసాడు బండ్ల. మరి ఈయన చేసిన వ్యాఖ్యలతో సాయి రెడ్డి ఇంకెంత ఘాటుగా స్పందిస్తాడో చూడాలి.